ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్పక్షపాతం లేని అభివృద్ధి... ప్రతి ఇంటికీ సంక్షేమం అందిస్తున్న కూటమి ప్రభుత్వం

పక్షపాతం లేని అభివృద్ధి… ప్రతి ఇంటికీ సంక్షేమం అందిస్తున్న కూటమి ప్రభుత్వం

📰 Generate e-Paper Clip

*ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకే “ఇంటింటికి తెలుగుదేశం”*

*గ్రామగ్రామంలో ఎమ్మెల్యే అమరనాథ రెడ్డికి ఘన స్వాగతం*

*దశాబ్దాల కల షికారీపాళ్యం రోడ్డు నెరవేర్చిన ఎమ్మెల్యే* …

*భావోద్వేగంతో ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్థులు*

*రెండో రోజు పెద్దపంజాణి మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి*

పలమనేరు, జులై 28 ( గరుడ ధాత్రి ) :
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పక్షపాతం లేని అభివృద్ధితో పాటు ప్రతి అర్హ కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందేలా పాలన సాగుతోందని పలమనేరు శాసనసభ్యులు అమరనాథ రెడ్డి అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమంలో భాగంగా రెండో రోజు మంగళవారం పెద్దపంజాణి మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా బండకుంట, చామనేరు, కుంభర్లపల్లి, గోనమాకులపల్లి, దెయ్యాలగడ్డ, షికారీపాళ్యం, అప్పినపల్లి, చిన్నపరెడ్డిపల్లి, దొమ్మిరిపాళ్యం, పెద్ద వెలగటూరు, చిన్న వెలగటూరు, సొన్నేపల్లి, రాజుపల్లి గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…, గత ప్రభుత్వ ఆర్థిక అవ్యవస్థను అధిగమిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం, పెరిగిన సామాజిక పింఛన్లు వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఇంట్లో ఒక మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందన్నారు.
రైతుల సంక్షేమానికి అన్నదాత సుఖీభవ, సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు, ఇతర ప్రోత్సాహకాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో రోడ్లు, తాగునీటి సౌకర్యం, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.

*ఎమ్మెల్యే చేతుల మీదుగా పలు అభివృద్ధి పనుల ప్రారంభం*

పర్యటన సందర్భంగా బండకుంటలో రూ.60 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు, చామనేరులో రూ.2 లక్షల సీసీ రోడ్డు, చిన్నపరెడ్డిపల్లిలో రూ.10 లక్షల సీసీ రోడ్డు, అలాగే కేఏ రోడ్డు నుంచి షికారీపాళ్యం వరకు రూ.1.10 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. అదేవిధంగా సంపల్లి, రాజుపల్లిలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు.

*ఎమ్మెల్యేపై అభిమానాన్ని చాటుకున్న షికారీపాళ్యం గ్రామస్థులు*

దశాబ్దాలుగా రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమ గ్రామానికి రూ.1.10 కోట్లతో తారు రోడ్డు నిర్మించడంతో షికారీపాళ్యం గ్రామస్థులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే అమరనాథ రెడ్డికి పూలవర్షం కురిపించి, భారీ పూలమాలలు వేసి, శాలువాలతో ఘనంగా సత్కరించారు. “ప్రభుత్వాలు మారినా మా గ్రామ తలరాత మారదని భావించాం. కానీ కూటమి ప్రభుత్వం మా దశను మార్చింది. మా గ్రామానికి శాశ్వత రహదారి కల్పించిన ఎమ్మెల్యే అమరనాథ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం” అంటూ గ్రామస్థులు భావోద్వేగంతో తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమాల్లో మండల స్థాయి అధికారులు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!