గరుడ దాత్రి న్యూస్ మైదుకూరు జులై 29
మైదుకూరు టౌన్ సాయినాథపురంలోని ప్రసిద్ధ చిన్న సాయిబాబా దేవాలయంలో గురుపౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల నడుమ జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం 6 గంటలకు స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచామృతాలు మరియు సుగంధ ద్రవ్యాలతో భక్తులు స్వహస్తాలతో ఉదయపు అభిషేకం నిర్వహించారు.
అధ్యక్షునికి ఘన స్వాగతం – ఊరేగింపు:
ఉదయపు అభిషేకం అనంతరం ఆలయ కమిటీ సభ్యులు సాయిబాబా గుడి కమిటీ అధ్యక్షులు కరమలపుటీ సుబ్బరాయుడు నివాసానికి వెళ్లి, గురుపౌర్ణమి ఉత్సవాలకు ఆయనను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి, పూలదండలతో ఘనంగా గౌరవించారు. అనంతరం అక్కడి నుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా మెరవణిగాఆయనను సాయిబాబా గుడికి తోడ్కొని వచ్చారు.
విశేష పూజలు – అన్నదాన కార్యక్రమం:
అనంతరం ఉదయం 11 గంటలకు స్వామివారికి విశేష అభిషేకం, శోభాయమానమైన అలంకరణ గావించారు. ఆలయ ప్రాంగణం భక్తుల “ఓం శ్రీ సాయినాథాయ నమః”, “సాయిరామ్” నామస్మరణలతో మారుమోగింది. పూజా కార్యక్రమాల అనంతరం విచ్చేసిన భక్తులందరికీ విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి, తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ వేడుకల్లో శిరిడి సాయిబాబా దేవస్థానం అధ్యక్షులు కరమలపుటీ సుబ్బరాయుడుతో పాటు కార్యవర్గ సభ్యులు బాల వీరయ్య, కోట అశోక్, చేదెల సత్య, టంగుటూరు సుధాకర్, తాటి సుబ్బరాయుడు, అయితరాజు లక్ష్మీ నరసయ్య, వైద్యనాథ్, రవి, వేణుగోపాల్ ఆచారి, సాయి, పుట్టా శివ, పబ్బతి గోపాల్, బొగ్గరపు గురు ప్రసాద్, రామాంజనేయులు, నేతి బంగారు రెడ్డయ్య, ఇతర కమిటీ ప్రతినిధులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు.
మైదుకూరు చిన్న సాయిబాబా ఆలయంలో వైభవంగా గురుపౌర్ణమి ఉత్సవాలు
RELATED ARTICLES
