ePaper
Friday, July 31, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఘనంగా ఇంటింటికీ కూటమి నాయకులు

ఘనంగా ఇంటింటికీ కూటమి నాయకులు

📰 Generate e-Paper Clip

పలమనేరు,జూలై 31 ( గరుడ ధాత్రి ) :

పలమనేరు మున్సిపల్ పరిధిలోని చరకా కాలనీ, విద్యానగర్ లో “ఇంటింటికీ కూటమి” కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక నాయకులు ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికీ వెళ్తూ గత రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో అందించిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ, ప్రభుత్వం చేస్తున్న ప్రజానుకూల పాలనపై వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా జిల్లా ఈడిగ గౌడ్ సంఘం అధ్యక్షులు, మాజీ మునిసిపల్ కౌన్సిలర్ కృష్ణమూర్తి గౌడ్, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి గిరిబాబులు మాట్లాడుతూ……ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి అర్హత కుటుంబానికి చేరేలా పార్టీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయని తెలిపారు.ప్రజా సంక్షేమమే ధ్యేయంగా స్థానిక శాసన సభ్యులు అమరనాదరెడ్డి సారథ్యంలో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనిట్ ఇంచార్జ్ సురేష్, వార్డు అధ్యక్షులు నరేష్, కన్వీనర్ లోకమూర్తి, శ్రీనివాసులు, గోవింద్ స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!