ePaper
Friday, July 31, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం ద్విచక్ర వాహనదారుడు మృతి..

హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం ద్విచక్ర వాహనదారుడు మృతి..

📰 Generate e-Paper Clip

మృతుడి గుర్తింపునకు పోలీసుల విజ్ఞప్తి

✒️నాగలాపురం మండల కేంద్రంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు, TN 18 BS 2181 నంబరు గల బొలెరో లగేజీ వాహనం పిచ్చాటూరు వైపు వెళ్తుండగా, ఎదురుగా వెళ్తున్న TN 18 BY 1194 నంబరు గల ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న సుమారు 30–35 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు.

మృతుడి గుర్తింపు వివరాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. మృతుడిని ఎవరైనా గుర్తించినా లేదా అతని వివరాలు తెలిసిన వారు ఉంటే వెంటనే నాగలాపురం పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి సమాచారం అందించాలని కోరారు. ప్రజలు అందించే సమాచారం మృతుడి గుర్తింపు, అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించడం, తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు ఎంతో ఉపయోగపడుతుందని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!