తిరుపతి, జులై 31 :
తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు ఇలాంటివన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య, 34వ డివిజన్ క్లస్టర్ ఇంచార్జ్ మునిశేఖర్ రాయల్ తెలిపారు. శుక్రవారం 34 డివిజన్ పరిధిలోని 114వ బూత్ లో రెండేళ్ల పాలనపై తెలుగుదేశం పార్టీ డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈ రెండేళ్ల కాలంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సుబ్బరామయ్యతో పాటు మునిశేఖర్ రాయల్ ఇంటింటికి వెళ్లి వివరించారు. 34 డివిజన్ పరిధిలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా తాము ముందుండి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూనిట్ ఇంచార్జ్ సురేష్ కుమార్, బూత్ కన్వీనర్ యశ్వంత్,ముని సుబ్రహ్మణ్యం, గంగయ్య, నైనార్ శ్రీనివాస్, వేణుగోపాల్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం, రెండు కళ్ళు
RELATED ARTICLES
