ఆశా వర్కర్స్ యూనియన్ చంద్రకళ మమత డిమాండ్ కార్వేటినగరం ఆగస్టు 4 గరుడవేద్రి న్యూస్
ఆషాడే సందర్భంగా మంగళవారం ఎస్ ఆర్ పురం హాస్పిటల్లో వైద్య అధికారి కి ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్ యూనియన్ ఎఐటియుసి అనుబంధం ఆధ్వర్యంలో ఆశ వర్కర్స్ యూనియన్ నాయకులు కోకిల మమత అధ్యక్షతన వైద్యాధికారికి వినతిపత్రం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ ఆశ వర్కర్స్ జిల్లా నాయకులు మాట్లాడుతూ ఈరోజు ఆశ కార్మికులకు పని భారం రోజురోజుకు పెరుగుతున్నది .వేతనాలు మాత్రం ప్రభుత్వం పెంచడం లేదు .కావున వెంటనే ఆశా కార్యకర్తలుకు 26000 వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు పోరాటాల సందర్భంగా శిబిరాలకు వచ్చి ప్రతిపక్ష నాయకులు మన ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష పార్టీ నాయకులందరూ అధికారానికి వచ్చిన వెంటనే జీతాలు ప్రస్తావని మీకు అండగా ఉంటామని హామీ ఇచ్చి రెండు సంవత్సరాలు పూర్తి అవుతున్న ఇంతవరకు వేతనాలు పెంచలేదు. కావున ఆశాలకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచి పని బారం తగ్గించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తారు ఈరోజు మెడికల్ ఉద్యోగులకు వర్తించే విధంగా వారాంతపు సెలవులు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. 1972 చట్ట ప్రకారం గ్రాడ్యువిటీ ఇవ్వాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు చంద్రకళ S R పురం పిహెచ్సి నాయకులు కోకిల మమత స్వర్ణలత ధనలక్ష్మి పాల్గొన్నారు
కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆశా కార్యకర్తలకు జీతాలు పెంచి,ఉద్యోగ భద్రత కల్పించాలి.
RELATED ARTICLES
