కార్వేటినగరం ఆగస్ట్ 6 (గరుడదాద్రి న్యూస్):
కార్వేటి నగరం లో కుమారగిరిపై వెలసిన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఆడికృతి సందర్భంగా వచ్చే భక్తులకు కీళ్లపూడి నారాయణరెడ్డి వారి కుటుంబ సభ్యులు ముత్తు మునిస్వామి రెడ్డి, దేవా రెడ్డి, మహాలక్ష్మమ్మ, కర్రెపరెడ్డి బాలకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు దాదాపు 5,000 మంది పైగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు, అదేవిధంగా పూర్వ విద్యార్థులు దాదాపు 1000 మంది పైగా అన్నదాన కార్యక్రమం, త్రాగునీటి సరఫరా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారందరికీ ఆలయ కమిటీ కృతజ్ఞతలు తెలిపారు.
