ePaper
Saturday, August 8, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్సత్యవేడులో కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి దెబ్బకి నాలుగు వర్గాలుగా విడి పోయిన తమ్ముళ్ళు...

సత్యవేడులో కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి దెబ్బకి నాలుగు వర్గాలుగా విడి పోయిన తమ్ముళ్ళు…

📰 Generate e-Paper Clip

రెండేళ్లు అభివృద్ధి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేయాలన్నది అధిష్టానం సూచన….
సత్యవేడు జూలై 08 గరుడధాత్రి న్యూస్ :
సత్యవేడు పట్టణంలో శంకర్ రెడ్డి దెబ్బకి పోటాపోటిలతో ఇంటి ఇంటికి రెండేళ్ల అభివృద్ధి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఏకతాటిపై పార్టీని తీసుకొని వస్తాను అన్న కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి ఇప్పుడు పార్టీని సత్యవేడులో నాలుగు వర్గాలుగా చేసేశారు.
దీంతో తెలుగు తమ్ముళ్లు నువ్వా నేనా అంటూ పోటీపడుతుంటే… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన తన సోదరుడు తెలుగు తమ్ముళ్లు పై ఆధిపత్యం చలాయిస్తున్నారు. ఈ వైకాపా పార్టీ నుంచి వచ్చిన సోదరుడుకి శంకర్ రెడ్డి మద్దతు పూర్తిగా ఇవ్వడంతో వైకాపాదారులకే ప్రభుత్వ కార్యాలయలో అన్ని పనులు జరగడంతో…తమ్ములకు మాత్రం ఏ ఒక పని జరగక పోవడంతో తమ్ములు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే రానున్నది స్థానిక సంస్థల ఎన్నికలు ఈ పోట్లాటలు ఇలానే జరిగితే స్థానిక ఎన్నికలకు తీవ్ర నష్టం కలుగుతుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు బహిరంగంగానే పేర్కొంటున్నారు .
తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ ఇక్కడ తమ్ముళ్లు అందరూ ఒకే దిశగా పనిచేస్తుంటే… కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి వైకాపా పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు ఆధిపత్యం ఇవ్వడంతో ఏం చేయాలో తెలీక తమ్ముళ్లు మౌనం వ్రతం పాటిస్తున్నారు.
వైకాపా పార్టీ నుంచి వచ్చిన తన సోదరుడు అధికారులపై బెదిరింపులు, భూకబ్జాలు, భూదందాలు, అక్రమ ఇంటి పట్టాలు, కొన్ని విద్యుత్ సబ్ స్టేషన్ లలో లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తూ , అధికార జూలుం విధిస్తుండటం … వైకాపా పార్టీ నుంచి వచ్చిన సోదరుడుకీ లోలోపల అధికారులకి వత్తాసు పలకడం…కుటుంబ రాజకీయాలకు శంకర్ రెడ్డి ఎంత ప్రధాన్యత ఇస్తున్నారో తెలుస్తుంది. దీంతో తెలుగు తమ్ముళ్ళ కి శంకర్ రెడ్డి కి మధ్య మనస్పర్ధలు, సీనియర్ నేతలను విస్మరించడం తో వర్గ విభేదాలు మొదలై పార్టీకి తీరని నష్టం వాటిల్లుతోంది.
దీంతో చేసేది ఏమీ లేక మరో వర్గం కొన్ని కారణాలతో సస్పెండ్ అయిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంతో క్యాడర్ మద్దతు పలకడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
సత్యవేడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి దెబ్బకి నలిగిపోవడం కంటే ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంతో పోవడమే మంచిదని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలతో పార్టీ క్యాడర్ ప్రభుత్వ కార్యక్రమాలను ముందుకు తీసువెలుతూ.. దూసుకుపోతున్నారు.
ఇప్పటికైనా కొఆర్డినేటర్ శంకర్ రెడ్డి అరాచకాలును గుర్తించి తమ్ముళ్లు నాలుగు వర్గాలుగా కాకుండా అందరూ ఏకతాటిపై వచ్చి కార్యక్రమంలో పాల్గొని పార్టీ పటిష్టతకు,పార్టీ బలోపేతానికి బాగుంటుందని పలువురు పేర్కొంటున్నారు‌.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!