ePaper
Saturday, August 8, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్11 రోజుల్లో 30.38 లక్షల ఇళ్లను సందర్శించిన టీడీపీ శ్రేణులు

11 రోజుల్లో 30.38 లక్షల ఇళ్లను సందర్శించిన టీడీపీ శ్రేణులు

📰 Generate e-Paper Clip

* ఇప్పటివరకు 30.38 లక్షల ఇళ్లను సందర్శించిన టిడిపి శ్రేణులు.
* వేగంగా కొనసాగుతున్న ఇంటింటికి తెలుగుదేశం.
* ఇంటింటికి టిడిపి శ్రేణులు కొనసాగుతున్న తీరుపై లోకేష్ నిత్యం పరిశీలన.
కుప్పం,ఆగస్టు 07 (గరుడ ధాత్రి న్యూస్): కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ల ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం గత నెల 27న ప్రారంభమైంది.కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో రాష్ట్రంలో సాధించిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ఇంటింటికీ తెలుగుదేశం – 2 ఏళ్ల నమ్మకం -అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమం విజయవంతంగా 11వ రోజుకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటూ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా 11వ రోజు రాష్ట్రవ్యాప్తంగా 3.40 లక్షల ఇళ్లను టీడీపీ శ్రేణులు సందర్శించారు. కార్యక్రమం మొదలైన తర్వాత నేడు అత్యధికంగా ఇళ్లను టీడీపీ శ్రేణులు సందర్శించారు. దీంతో గత 11 రోజుల్లో మొత్తంగా 30.38 లక్షల ఇళ్లకు చేరుకుని, కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, అందిస్తున్న సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించారు. కాగా జాతీయ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రతిరోజు కార్యక్రమం కొనసాగుతున్న తీరును సమీక్షిస్తున్నారు.గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగిన తీవ్ర విధ్వంసాన్ని, అధికారం చేపట్టిన తర్వాత కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని మళ్లీ ప్రగతి పథంలోకి తెచ్చిన తీరును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని లోకేష్ దిశానిర్దేశం చేశారు. ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటి వద్ద నాయకులు కనీసం మూడు నిమిషాలైనా సమయం కేటాయించి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను,సాధించిన పురోగతిని వివరించాలని సూచించారు. చంద్రబాబు నాయుడి పారదర్శక పాలన, పవన్ కళ్యాణ్ చొరవ, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలే ఈ ఎన్నికల్లో కూటమికి తిరుగులేని ప్రజాదరణ తెచ్చిపెడతాయని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు.ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని మంత్రి నారా లోకేష్ టెక్నాలజీని వినియోగిస్తూ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఇంటింటి సందర్శనలు, పార్టీ శ్రేణుల పనితీరుపై ఎప్పటికప్పుడు వివరాలు తెప్పించుకుంటూ పర్యవేక్షిస్తున్నారు. కార్యక్రమంలో ఉత్తమ పనితీరు కనబరుస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలను నారా లోకేష్ అభినందిస్తూ, ఇదే స్ఫూర్తితో మరింత ఉత్సాహంగా కార్యక్రమాన్ని కొనసాగించాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ “ఇంటింటికీ తెలుగుదేశం” కార్యక్రమాన్ని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు నారా లోకేష్ ప్రత్యేక చర్యలు చేపట్టారు.స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్డీయే కూటమి శ్రేణులను, యంత్రాంగాన్ని సంపూర్ణంగా సన్నద్ధం చేయాలని మంత్రి నారా లోకేష్ మంత్రులకు టాస్క్ ఇచ్చారు. ఎన్నికల వ్యూహాలు, పార్టీల మధ్య సమన్వయం, క్షేత్రస్థాయి కార్యాచరణపై మంత్రులతో నారా లోకేష్ సుదీర్ఘంగా చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్దేశిత సమయానికే జరుగుతాయని, ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని మంత్రి లోకేష్ మంత్రులకు స్పష్టం చేశారు. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్, పురపాలక ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కూటమి అభ్యర్థులే కైవసం చేసుకునేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. నియోజకవర్గాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!