ePaper
Saturday, August 8, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్డప్పు కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి

డప్పు కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి

📰 Generate e-Paper Clip

పింఛన్ 7000 రూపాయలకు పెంచాలి.

మండలంలోని స్మశానాల సమస్యలు పరిష్కారం చేయాలి
తాహసిల్దార్ ఆఫీస్ వద్ద వ్యవసాయ కార్మిక సంఘం, కుల వ్యవసాయ వ్యతిరేక పోరాట సంఘాల ఆధ్వర్యంలో ధర్నా

శుక్రవారం నాడు మండల కేంద్రమైన నాగలాపురంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘాల ఆధ్వర్యంలో సాయిబాబా గుడి నుండి తాసిల్దార్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు.

ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి జనార్ధన్ ,కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మెలుగు రమేష్ మాట్లాడుతూ మండలంలో డప్పు కళాకారులకు గుర్తింపు కార్డులు ఇచ్చి పించను 7000 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. మండలంలోని సుందరయ్య కాలనీలో 14 సంవత్సరాలుగా నివాసం ఉన్నప్పటికీ దళితులు గిరిజనులు, మైనారిటీలు ఇల్లు కట్టుకొని నివాసం ఉంటే ఇప్పటికే కరెంటు సౌకర్యం లేక రాత్రిపూట పాముల బెడదతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు.
త్రాగునీరు సౌకర్యం లేకుండా సిమెంట్ రోడ్లు సౌకర్యం లేకుండా వర్షాకాలం వస్తే మొత్తం బురదమయమై జబ్బులు బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు తక్షణమే అధికారులు స్పందించి సుందరయ్య కాలనీకి మౌలిక వసతులు విద్యుత్తు సిమెంటు రోడ్లు త్రాగునీరు సౌకర్యం డ్రైనేజీ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

మండలంలోని బీర కుప్పం దళితవాడకు స్మశాన స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జీవో నెంబర్ 12 35 ప్రకారం ఒక ఎకరా కేటాయించాలని డిమాండ్ చేశారు .రాజుల కండ్రిక అరుంధతి వాడకు కడువేడు వెల్లూరు దళితవాడల స్మశానాలకు వెళ్లే దారి లేదని అక్కడ దళితులు మనిషి చివర మజిలీ పంట పొలాలు వాగులో వంకల మీదుగా తీసుకెళ్తూ తీవ్రమైన కష్టాలు పడుతున్నారని తెలిపారు తక్షణమే అధికారులు స్పందించి ఈ స్మశానాలకు దర్శకత్వం కల్పించాలని డిమాండ్ చేశారు
కొట్ట కాడు దళితవాడకు స్మశానానికి సిమెంటు రోడ్డు త్రాగునీరు బోరు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు వేంపాకం దళిత వాడ స్మశాన దారి ఆక్రములకు గురై ఉన్నప్పటికీ అధికారులు సర్వే చేసి తొలగించడం లేదని తెలిపారు వెంటనే ఆక్రమణ తొలగించాలని డిమాండ్ చేశారు ఎస్ ఎస్ పురం దళితవాడకు కేవలం 10 సెంట్లు స్థలం పూడ్చుతున్నారని జీవనంబర్ 12 35 ప్రకారం ఒక ఎకరం స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు.
మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని అక్రమ ఇసుక రవాణా అరికట్టాలని డిమాండ్ చేశారు గిరిజనలు దళితుల నివాసం ఉన్న ప్రాంతాల్లో గ్రావెల్ మాఫియా చొరబడి మట్టిని ఇతర రాష్ట్రాలకు తరలించి కోట్ల రూపాయల గడుస్తున్నారని మట్టి మాఫియా పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ సమస్యల పైన తహసిల్దార్ రోజా రమణికి వినతి పత్రాన్ని ఇచ్చారు స్పందించిన తాసిల్దార్ మాట్లాడుతూ తక్షణమే అధికారులతో మాట్లాడి పై సమస్యలను కూడా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు అమ్ముదా మండల అధ్యక్ష కార్యదర్శులు బాలాజీ సుబ్బమ్మ జీవ శ్రీవల్లి డప్పు కళాకారుల సంఘం మండల అధ్యక్షుడు ముత్తు మండల కార్యదర్శి పరంధామయ్య మనోహర్ వెంకటయ్య మనోహర్ కోశాధికారి రాజా ధనరాజ్ దయాలన్ దొరకన్ను వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు కృష్ణయ్య గ్రీన్ అంబాసిడర్ సంఘం జిల్లా నాయకులు మునుస్వామి మహిళా సంఘం నాయకురాలు గౌస్యబి డప్పు కళాకారులుతదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!