పలమనేరు ఆగస్టు 7 ( గరుడ ధాత్రి): పుట్టిన బిడ్డకు తల్లిపాలు అమృతం లాంటిదని ఐసిడియస్ సూపర్వైజర్ మాధవి లత పేర్కొన్నారు. ఐసిడిఎస్ అంగన్వాడీల ద్వారా నిర్వహిస్తున్న తల్లి పాలు వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం పలమనేర్ రూరల్ మండలం కొలమసనపల్లి పంచాయతీ, కొలమసనపల్లి అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని గ్రామస్తులతో కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింద తెలిపారు. సూపర్వైజర్ మాధవి లత మాట్లాడుతూ శిశువు పుట్టిన గంటలోపు ఆలస్యం చేయకుండా తల్లిపాలు తాగించాలని సూచించారు. మొదట ఆరు నెలలు పాటు కేవలం తల్లి పాలు మాత్రమే అందించి అనంతరం తల్లిపాలు తో పాటు పౌచికాహారం అందించడం వలన బిడ్డకు కలిగే ప్రయోజనాలను అక్కడ హాజరైన వారికి క్లుప్తంగా వివరించడం జరిగిందన్నారు. తల్లిపాలు ఇవ్వడం వలన శిశువు ఎదుగుదలతో పాటు అవసరమైన పోషకాలు, రోగ నిరోధక శక్తి పెంపొందుతాయని తెలిపారు. పుట్టిన శిశువుకు తల్లిపాలు మొదటి టీకా, సంపూర్ణమైన పౌష్టికాహారమని ఐసిడిఎస్ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పోత పాలు అందించడం వలన బిడ్డ అనుకున్నంత ఆరోగ్యకరంగా ఎదగడానికి అవకాశం ఉండదన్నారు. అంగన్వాడి ద్వారా అందించే పౌచికాహారాన్ని తల్లి తీసుకోవడం వలన బిడ్డ కూడా అదే స్థాయిలు పుష్టిగా, శరీర దారుడ్యముగా కలిగి ఉండడానికి అవకాశం ఉందన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలు, వారి బిడ్డలు ఆరోగ్యవంతులుగా ఉండాలని మంచి సంకల్పముతో అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నారని సూచించారు. అనేకమంది మహిళలు రక్తహీనత వలన అనారోగ్య బారినబడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని అలాంటివారు అంగన్వాడీ కేంద్రంలో ప్రతి నెల రెండవ శనివారం వైద్య సిబ్బంది నిర్వహించే హెల్త్ క్యాంపుకు తప్పకుండా హాజరై వైద్యుల సూచనలు తీసుకోవాలన్నారు. అనంతరం ప్రపంచతల్లిపాల వారోత్సవాల సందర్భంగా బ్యానర్లు పట్టుకొని పురవీధుల్లో నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్ రెడ్డమ్మ, రేవతి, వాణి, ధనమ్మ, జ్యోతి, నిర్మల ప్రేమావతి, రత్నమ్మ, సరస్వతి,శాంతమ్మ ఏఎన్ఎం, ఆశా వర్కర్లు,గర్భిణీలు, బాలింతలు, తల్లులు మరియు అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
