ePaper
Saturday, August 8, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఎం ఎం విలాసం పంచాయతీలో ఎల్నినో గ్రామసభ

ఎం ఎం విలాసం పంచాయతీలో ఎల్నినో గ్రామసభ

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం ఆగస్టు 7( గరుడదాద్రి న్యూస్) కార్వేటినగరం మండలంలోని ఎం ఎం విలాసం గ్రామం నందు ఎల్నినో ప్రభావం- నివారణ కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది . ఏవో హేమలత మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి రైతు యొక్క వ్యవసాయ భూమి కమతాన్ని 100% సందర్శించడం మరియు ప్రస్తుత పంట పరిస్థితి నీటి కొరత వలన పంట వాడిపోవడం లేదా ఎండిపోవడం చీడపీడల వృద్ధికి ఉద్యాన పంటల పరిస్థితి బీడు లేదా సాగు చేయండి భూముల వివరాలు అంటివి అంచనా వేయడము జరుగుతుంది. అలాగే క్షేత్రస్థాయిలో గుర్తించిన కరిగి పరిస్థితుల్ని తగు విధంగా సస్యరక్షణలు పాటించడం ,మల్చింగ్ ద్వారా తేమ సంరక్షణ చర్యలు, విత్తన గుళికలు, ప్రతికూల వాతావరణ మార్పులకు అనుగుణంగా వేసుకోవాల్సిన ప్రత్యామ్నాయ పంటలు ,అంతర పంటల సాగు పంటనిర్వహణ వంటి పరిష్కార చర్యలు సూచించడం జరిగింది . అలాగే రైతులు తమ పొలాలని బీడుగా వదిలేయకుండా పిఎండిఎస్ విత్తన కిట్లను ఎకరానికి 15 కేజీలు చొప్పున చల్లుకోవడం ద్వారా పశువులకు మేతగా ఉపయోగపడడమే కాకుండా రైతులు ప్రధాన పంట వేసే ముందు ఆ మొక్కలని ఎకర పొలంలో కలియుదున్ని కుళ్ళ పెట్టడం ద్వారా పచ్చ రొట్టె పైరుగా కూడా ఉపయోగపడుతుంది. ఎల్ నినో ప్రభావ దృష్ట్యా రైతులు వరి పంటను వేయకూడదని సూచించడం జరిగింది .ఇదివరకే ఎవరన్నా రైతులు వరి పంట వేసుకున్నట్లయితే పి ఎం ఎఫ్ బి వై ఇన్సూరెన్స్ పథకం కింద ఎకరానికి 840 ప్రీమియం కడితే ఎకరానికి 42 వేల రూపాయలు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది ఎవరైతే పంట బీమా చేయించుకుంటారో వారికే పంట నష్ట పరిహారం అందుతుంది, వరి పంట బీమా చేయించుకోవడానికి ఆగస్టు 15వ తారీకు ఆఖరి తేదీ ,కావున రైతులందరూ వరి పంట బీమా చేయించుకోవాల్సిందిగా సూచించడమైంది.ఈ కార్యక్రమంలో ఆర్ఎస్కే సిబ్బంది, రైతులు ,వెటర్నరీ సిబ్బంది అలాగే సే�

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!