ePaper
Sunday, August 9, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఆదిమూలం నిస్వార్థ నాయకుడు... టీడీపీ సీనియర్ నేత ఇళంగోవన్ రెడ్డి

ఆదిమూలం నిస్వార్థ నాయకుడు… టీడీపీ సీనియర్ నేత ఇళంగోవన్ రెడ్డి

📰 Generate e-Paper Clip

* ప్రచార ఆర్భాటాలకు దూరం

– ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నారు

పిచ్చాటూరు జూలై 09 గరుడధాత్రి :

ప్రతికూల పరిస్థితుల్లోనూ నాయకత్వ హుందాతనాన్ని ప్రదర్శిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం నిస్వార్థ నాయకుడని టీడీపీ సీనియర్ నాయకుడు, పిచ్చాటూరు మండల మాజీ అధ్యక్షుడు, క్లస్టర్ ఇన్‌చార్జ్ ఇళంగోవన్ రెడ్డి అన్నారు.
ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇళంగోవన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఆదిమూలం ప్రచార ఆర్భాటాలతో ప్రగల్భాలు పలికే నాయకుడు కాదని, తన పని తాను చేసుకుంటూ ప్రజల్లో ఉంటున్న నాయకుడని అన్నారు. తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ నియోజకవర్గంలో నిరంతరం పర్యటిస్తున్నారని తెలిపారు.
నియోజకవర్గంలోని ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన ప్రజాప్రతినిధిగా ఆదిమూలం పనిచేస్తున్నారని ఇళంగోవన్ రెడ్డి పేర్కొన్నారు. ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన.. ఏడు పదులు దాటిన అర్హులైన వృద్ధులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడంతో పాటు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనే తపనతో పనిచేస్తున్నారని అన్నారు.

* కార్యకర్తలకు భరోసా.. పార్టీ బలోపేతానికి కృషి

నాయకులను వెంటబెట్టుకుని కార్యకర్తలకు భరోసా కల్పిస్తూ పార్టీ బలోపేతానికి అడుగడుగునా కృషి చేస్తున్న ఆదిమూలం ఈ తరం నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారని ఇళంగోవన్ రెడ్డి అన్నారు. పార్టీకి, కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఎమ్మెల్యేకు తాము అండగా నిలిచామని తెలిపారు. నాయకుడంటే జవాబుదారీతనంతో ఉండాలని, ఆ లక్షణం ఆదిమూలంలో ఉందన్నారు.

* అధికారం కోసం కాదు.. అధినేత నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యం

ఆదిమూలం తాపత్రయం అధికారం కోసం, ఉనికి కోసం కాదని ఇళంగోవన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో తెలుగుదేశం జెండాపై ఎన్నో అడ్డంకులు, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని గెలిచిన ఆదిమూలం.. అధినేత నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే తపనతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ విషయాన్ని ప్రజలు, నాయకులు, కార్యకర్తలు గమనించి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.
ఎన్నికల సమయంలో గ్రామస్థాయిలో స్థానిక సమస్యల పరిష్కారానికి పార్టీ మేనిఫెస్టో ద్వారా హామీలు ఇస్తామని, ఎన్నికల అనంతరం ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయితే కార్యకర్తలు గర్వంగా ప్రజల్లోకి వెళ్లి పార్టీని మరింత బలోపేతం చేస్తారని తెలిపారు.

* పార్టీ ముఖ్యం.. సిద్ధాంతాలు ముఖ్యం

టీడీపీకి ప్రగల్భాలు పలికే నాయకుల కంటే ప్రజా సేవ చేసే నాయకులే అవసరమని ఇళంగోవన్ రెడ్డి స్పష్టం చేశారు. తమకు పార్టీ, పార్టీ అధినేత, పార్టీ సిద్ధాంతాలు, ప్రాంతంలో టీడీపీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం ముఖ్యమని అన్నారు.
కార్యకర్తలు, నాయకులకు అండగా నిలిచే నాయకత్వం తమకు అవసరమని, పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయాలను శిరసావహిస్తామని చెప్పారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ బలోపేతానికి కృషి చేసే ఎవరితోనైనా అధిష్టానం ఆదేశిస్తే కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.

* సమస్య చెబితే అక్కడికే ఎమ్మెల్యే

నియోజకవర్గంలోని వివిధ మండలాలు, గ్రామాల్లో కార్యకర్తలు, ప్రజలు సమస్యలు చెప్పిన వెంటనే ఎమ్మెల్యే ఆదిమూలం స్పందిస్తున్నారని ఇళంగోవన్ రెడ్డి తెలిపారు. సీఎం సహాయనిధి అవసరమైన కుటుంబాలకు వెంటనే స్పందిస్తూ, కుటుంబ పెద్దను కోల్పోయిన బాధలో ఉన్న కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా చేయూత అందిస్తున్నారని అన్నారు.
మండల కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన, స్థానిక సమస్యల పరిష్కారం కోసం జిల్లా ఉన్నతాధికారులతో కలిసి ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని తెలిపారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ఒకవైపు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, మరోవైపు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని చెప్పారు.

* ఆదిమూలంతోనే పార్టీ మరింత బలోపేతం అవుతుంది

ప్రజలు, కార్యకర్తల సమస్యలకు స్పందిస్తూ నిత్యం ప్రజల్లో ఉండే ఎమ్మెల్యే ఆదిమూలంతోనే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుందని తన వ్యక్తిగత అభిప్రాయంగా ఇళంగోవన్ రెడ్డి తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!