కాణిపాకం ఆగస్టు 11(గరుడదాత్రిన్యూస్) కాణిపాకం దేవస్థానంలో సెప్టెంబర్ నెల నుండి జరగనున్న 2026 వార్షికబ్రహ్మోత్సవాలపై మంగళవారందేవస్థానంకార్యనిర్వాహణధికారి కార్యాలయం లో ఈ.వో పెంచల కిషోర్,చైర్మన్ మణి నాయుడు ,ఆధ్వర్యంలో దేవస్థానం అధికారులు సిబ్బంది తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంజనీరింగ్ శాఖ అర్చకులు వేద పండితులు, హాజరయ్యారు బ్రహ్మోత్సవాలపై చర్చించారు ఈ సమావేశం నందు బ్రహ్మోత్సవాలపై అన్నదానం, కౌంటర్ల నిర్వహణ, లడ్డు పోటు నందు ప్రసాదం తయారీ, క్యూలైన్లు, బ్రహ్మోత్సవాలు సమయంలో ఆర్జిత సేవలు, వివిధ అంశాలపై చర్చించడం జరిగింది, ఈ కార్యక్రమంలో డిఈఓ సాగర్ బాబు, ఏఈఓ లు ఎస్వీ కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, ప్రసాద్, ధనపాల్, సూపర్డెంట్లు వాసు, దివాకర్ రెడ్డి, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.
