ePaper
Friday, August 14, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కార్మిక సంఘాల పోరాట ఫలితం.. సునీల్ కుటుంబానికి రూ.40 లక్షల పరిహారం

కార్మిక సంఘాల పోరాట ఫలితం.. సునీల్ కుటుంబానికి రూ.40 లక్షల పరిహారం

📰 Generate e-Paper Clip

వరదయపాళ్యెం, ఆగస్టు 14 గరుడధాత్రి న్యూస్:

వరదయ్యపాలెం మండలంలోని డిపి చాక్లెట్ తయారీ పరిశ్రమలో ప్రమాదవశాత్తు మృతి చెందిన బుచ్చినాయుడుకండ్రిగ మండలం వెస్ట్ వరత్తూరు గ్రామానికి చెందిన కార్మికుడు సునీల్ కుటుంబానికి రూ.40 లక్షల పరిహారం అందించేందుకు యాజమాన్యం అంగీకరించింది. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని కార్మిక సంఘాలు, సీఐటీయూ, ఏఐటీయూసీ, సీపీఎం నాయకులు డిమాండ్ చేస్తూ చేపట్టిన పోరాటం నేపథ్యంలో గురువారం యాజమాన్యంతో జరిగిన చర్చల్లో ఈ మేరకు ఒప్పందం కుదిరింది.
సునీల్ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, కార్మిక సంఘాల నాయకులు మెలుగు రమేష్, అంబాకం చిన్నిరాజ్, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు, సత్యవేడు నియోజకవర్గ కార్యదర్శి దాసరి జనార్ధన్, సత్యవేడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మురళి, వైఎస్సార్‌సీపీ నాయకుడు సామర్ల హరి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘు తదితరుల సమక్షంలో యాజమాన్యంతో చర్చలు జరిగాయి.
చర్చల అనంతరం సునీల్ కుటుంబానికి రూ.40 లక్షల పరిహారం చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించినట్లు దాసరి జనార్ధన్, మెలుగు రమేష్ తెలిపారు. ఈ మొత్తాన్ని మృతుడి మైనర్ పిల్లల పేర్లపై బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడానికి యాజమాన్యం అంగీకరించినట్లు వెల్లడించారు.
అదేవిధంగా ప్రమాద బీమా, పీఎఫ్, ఇతర ఇన్సూరెన్స్ ప్రయోజనాలు కూడా కుటుంబ సభ్యులకు అదనంగా వర్తిస్తాయని యాజమాన్యం తెలిపినట్లు నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బుచ్చినాయుడుకండ్రిగ సీపీఎం నాయకులు నలుగురి రమణయ్య, బాల గురవయ్య, ధనంజయ, వరదయ్యపాలెం మండల సీపీఎం నాయకులు సుబ్బయ్య, రమణయ్య, సత్యవేడు సీపీఎం నాయకులు కృష్ణయ్యతో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కాగా, డిపి చాక్లెట్ పరిశ్రమ వద్ద గ్రామస్తులు పెద్ద సంఖ్యలో గుమిగూడటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. సత్యవేడు సీఐ మురళి ఆధ్వర్యంలో బుచ్చినాయుడుకండ్రిగ, వరదయ్యపాలెం, సత్యవేడు, నాగలాపురం మండలాలకు చెందిన ఎస్‌ఐలు, పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!