ePaper
Friday, August 14, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్చిట్రెడ్డిపల్లి చెరువులో పడి యువకుడు మృతి

చిట్రెడ్డిపల్లి చెరువులో పడి యువకుడు మృతి

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి ఆగస్టు 11 గరుడ దాత్రి న్యూస్

– అనాధ శవానికి అంత్యక్రియలు నిర్వహించిన పోలీసులు

ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ 9 సంవత్సరాల క్రితం ఒక మూగ చెవుడు యువకుడు ( పేరు తెలియదు 28 సంవత్సరాలు)చౌడేపల్లికి చేరుకున్నాడు బస్టాండులో అందరితో మంచితనంతో ఉంటూ పనులు చేసుకుని సంపాదించి జీవించేవాడు ఈ క్రమంలో మంగళవారం చౌడేపల్లికి సమీపంలోని చిత్ రెడ్డి చెరువులో శవమై తేలాడు ప్రతిరోజు స్నానానికి చెరువుకు వెళ్లేవాడు ఇదే క్రమంలో ఈనెల 10న స్నానానికి వెళ్లిన అతను తిరిగి రాలేదు. సందేహం వచ్చిన స్థానిక బస్టాండ్లో ఉండేవారు చుట్టుపక్కల వెతికి వెతకగా చెరువులో శివమై కనిపించాడు మూగ అతనిగా గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకున్నారు అయితే పారిశుద్ధ కార్మికులు మృతదేహాన్ని చెరువులో నుంచి తీసేందుకు రాకుండా పోవడంతో స్వయంగా పోలీసులే గట్టుపైకి తెచ్చి అనాధ సవానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!