శిక్షణ కార్వేటి నగరం ఆగస్టు 13 గరుడదాద్రి న్యూస్ అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేసి చిన్నారులకు సమగ్ర విద్య మెరుగైన బోధన సంరక్షణ అందించడమే లక్ష్యంగా జ్ఞాన జ్యోతి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని సిడిపిఓ శోభారాణి అన్నారు. కార్వేటినగరం రాజా కుమారస్వామి రాజా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పూర్వ ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయడానికి వీలవుతుందన్నారు. శిక్షణ ద్వారా అంగన్వాడీ సిబ్బంది తమ నైపుణ్యాలను పెంపొందించడానికి విద్యార్థులు సమగ్రాభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ శిక్షణలో నేర్చుకున్న వాటిని పిల్లలకు చక్కగా బోధించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు విజయ్ కుమార్, మనోజ్ కుమార్, ప్రధానోపాధ్యాయులు కోటేశ్వరరావు,అంగన్వాడీ సూపర్వైజర్ రోజా రమణి జిల్లాస్థాయి విషయం నిపుణులు కరణం గిరిబాబు, జయ శ్రీ, మహేష్, మండలం చెందిన 65 మంది అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.
