పిచ్చాటూరు ఆగస్టు 15 గరుడధాత్రి :
దేశభక్తి స్ఫూర్తితో పిచ్చాటూరు మండల విద్యాశాఖ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంఈఓ డాక్టర్ కే. హేమమాలిని ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా ఎంఈఓ డాక్టర్ కే. హేమమాలిని మాట్లాడుతూ విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, నైతిక విలువలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని పేర్కొన్నారు.
కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
