ePaper
Saturday, August 15, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్G.S.పురం గ్రామ యువతకు అభినందనలు

G.S.పురం గ్రామ యువతకు అభినందనలు

📰 Generate e-Paper Clip

పిచ్చాటూరు ఆగస్టు 15 గరుడధాత్రి:

అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా స్ట్రీట్‌ లైట్ల సమస్య పరిష్కారం కాకపోవడంతో.. ఎన్నో రోజులుగా చీకటిలో ఉన్న గ్రామానికి వెలుగు అందించేందుకు G.S. పురం గ్రామ యువత ముందుకొచ్చింది. కీలాపూడి పంచాయతీ పరిధిలోని G.S. పురం H.W. స్ట్రీట్‌లో తమ స్వంత ఖర్చులతో స్ట్రీట్‌ లైట్లను ఏర్పాటు చేసి సేవాభావాన్ని చాటుకున్నారు.
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గ్రామ యువత ఐకమత్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం స్థానికంగా అభినందనలు అందుకుంటోంది. ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూడకుండా సమస్యను తమ వంతుగా పరిష్కరించుకోవడం ఆదర్శనీయమని పలువురు ప్రశంసిస్తున్నారు.
మహాత్మా గాంధీజీ కలలుగన్న “గ్రామ స్వరాజ్యం” స్ఫూర్తిని ఆచరణలో చూపిస్తూ “మన గ్రామం – మన బాధ్యత” అనే సందేశాన్ని G.S. పురం యువత చాటిచెప్పింది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!