బీసీ నాయకులు,స్థానికుల డిమాండ్
జిల్లా కలెక్టర్ కు వినతి
పలమనేరు,, ఆగష్టు 17 ( గరుడ ధాత్రి ) :
చిత్తూరు జిల్లా కలెక్టర్ కు జిల్లా బిసి ఫ్రంట్ అధ్యక్షులు పూలే గోవిందస్వామి, పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని గంటాఊరు బీసీ కాలనీకి చెందిన స్థానికులు కలసి అసంపూర్తి అంగన్వాడీ భవనం పూర్తి చేయాలని వారు సోమవారం పంపుకొన్న వినతిలో కోరారు. వివరాలు…. అక్కడి సాయిబాబా మందిరం దగ్గర అంగన్వాడి కేంద్రం 2021 _22 సంవత్సరంలో కొత్తగా ప్రభుత్వ భవనం నిర్మిస్తూ అర్ధంతరంగా పనులు ఆపేశారు. అప్పటి నుంచి అద్దె ఇంటిలో విధిలేక నిర్వహించుచున్నారు.ఈ కేంద్రంలో చిన్నపిల్లలు సుమారు 30 మంది, గర్భిణీ స్త్రీలు 20 మంది ఉన్నారు. అయితే ఆ అద్దె గది చిన్నగా ఉన్నదని అందులో గాలి,వెళుతురు లేక పైగా వర్షాకాలంలో నీళ్లు రావడం, పాములు తేళ్లు రావడం జరుగుతున్నదన్నారు.ఈ కారణంగా చిన్న పిల్లలు,గర్భిణీ స్త్రీలు కూర్చోలేక ఇబ్బంది పడుతున్నారన్నారు.ఆహార పదార్థములు,నిత్యావసర వస్తువులు, పాఠ్యపుస్తకాలు,ఫర్నిచర్ నిలువ ఉంచుకొనడానికి స్థలం లేక ఇబ్బందిగా వుందన్నారు. కనుక ఈ అసంపూర్తి అంగన్వాడి కొత్త భవనాన్ని ప్రభుత్వం పూర్తిచేసి చిన్న పిల్లలకు సౌకర్యవంతంగా చేయాలని బీసీ ప్రింట్ నాయకులు, అంగన్వాడీ పిల్లలు, పిల్లల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.
