బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు21
బైరెడ్డిపల్లి లోని శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయంలోశ్రావణ శుక్రవారం
శ్రీ వరమహాలక్ష్మి పూజలతో భక్తులు రద్దీ నెలకొన్నది.ఈ సందర్భంగాసాయంత్రం ఉంజల సేవ , మహా మంగళహారతి నిర్వహించారు. ఈకార్యక్రమంకు ఉభయదారులుగా టి స్. కళావాణి శ్రీనివాసులు కుటింబీకులు కొనసాగారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే బైరెడ్డిపల్లి మండలం లోని గౌనీతిమ్మినేపల్లి లో రామ భజన మందిరంలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని రాముల వారికి పంచామృత అభిషేకం చేపట్టి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్ద భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రావణ శుక్రవారం, శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించి రామకోటి కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ నేపథ్యంలో శనివారం ప్రత్యేక పూజలు అనంతరం రామకోటి కార్యక్రమం ఆదివారం వరకు 24 గంటల పాటు కొనసాగుతోంది అని అనంతరం రామస్వామి గ్రామోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. శ్రావణ శుక్రవారం కావడం తో భక్తులు తో ఆలయాల వద్ద రద్దీ నెలకొంది.
