ePaper
Saturday, August 22, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కైగల్ వద్ద బోల్తాపడ్డ పాల వ్యాన్, అశోక్ లైలాండ్ వాహనం. ఒకరికి గాయాలు

కైగల్ వద్ద బోల్తాపడ్డ పాల వ్యాన్, అశోక్ లైలాండ్ వాహనం. ఒకరికి గాయాలు

📰 Generate e-Paper Clip

బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు21
బైరెడ్డిపల్లి–కుప్పం జాతీయ రహదారిలోని కైగల్ వాటర్ ఫాల్స్ మలుపు వద్ద శుక్రవారం రెండు వాహనాలు ప్రమాదవశాత్తు ఢీకొని బోల్తాపడ్డాయి. దేవదొడ్డి నుంచి పాలు సేకరించుకుని వీకోట వైపు వెళ్తున్న మహేంద్ర పాల వ్యాన్ వికోట వైపు నుండి మామిడికాయల లోడుతో వెళ్తున్న అశోక్ లైలాండ్ వాహనం కైగల్ వాటర్ ఫాల్స్ సమీపంలోని మలుపు వద్ద ఢీకొన్నాయి.
దీంతో రెండు వాహనాలు అదుపుతప్పి రోడ్డుపై బోల్తాపడ్డాయి. అశోక్ లేలాండ్‌లో ఉన్న మామిడికాయలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. పాల వ్యాన్‌లోని పాలు నేలపాలైనట్లు సమాచారం. ఈ ప్రమాదంలో అశోక్ లేలాండ్ డ్రైవర్‌కు భుజం, చేతికి గాయాలైనట్లు తెలిసింది.బైరెడ్డిపల్లి పోలీసులు సంఘటన స్థలంకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులకు సహాయం అందించారు. సంఘటన స్థలం వద్ద రక్తం ఎక్కువుగా ప్రవహించింది.మరొకరికి ఏమైనా తీవ్రంగా గాయపడ్డారు అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. బైరెడ్డిపల్లి–కుప్పం జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పాటించొకొనేవారు లేకపోవడంతో ప్రజలు ప్రాణాలు గాలిలో కలసిపోతున్నది.రోజుకో ప్రమాదం జరుగుతున్న నాయకులు గాని,అధికారులు గాని పఠించుకోక పోవడం శోచనీయం అని విమర్సులు వెలువాడుతున్నది.ఇకనైనా ప్రమాదాల నివారణకు అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!