ePaper
Saturday, September 12, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్1980s’ పేరుతో నకిలీ యాప్స్‌.. నెటిజన్లకు సైబర్‌ మోసం!

1980s’ పేరుతో నకిలీ యాప్స్‌.. నెటిజన్లకు సైబర్‌ మోసం!

📰 Generate e-Paper Clip

అమరావతి సెప్టెంబర్ 11 గరుడధాత్రి:

1980ల నాటి ఫొటోలను ఎడిట్‌ చేసుకునేందుకు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్న యాప్స్‌ను సైబర్‌ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని అధికారులు హెచ్చరిస్తున్నారు. ‘1980s’ పేరుతో పలు నకిలీ యాప్స్‌ సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమవుతున్నట్లు గుర్తించారు.
ఈ యాప్స్‌ ద్వారా ఫొటోలు ఎడిట్‌ చేసుకునే క్రమంలో వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, ఇతర డేటా సైబర్‌ నేరగాళ్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉందని అధికారులు సూచిస్తున్నారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న యాప్స్‌ను చూసి వెంటనే డౌన్‌లోడ్‌ చేసుకోవద్దని, అధికారిక యాప్‌ స్టోర్లలో అందుబాటులో ఉన్న విశ్వసనీయ యాప్స్‌నే వినియోగించాలని సూచించారు.
నకిలీ యాప్స్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులపై క్లిక్‌ చేయవద్దని సైబర్‌ అధికారులు హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!