ePaper
Monday, September 28, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిబధిరులు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపడతాం -...

బధిరులు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపడతాం – చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్

📰 Generate e-Paper Clip

చిత్తూరు,సెప్టెంబర్,27(గరుడ దాత్రి న్యూస్)బధిరులు ఎదుర్కొంటున్నసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందిచిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక జడ్పీ కార్యాలయంలోని సమావేశ మందిరంలోజిల్లా విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ బధిరుల దినోత్సవం మరియు సంజ్ఞల భాషా దినోత్సవంపురస్కరించుకొని జిల్లా స్థాయి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాలన్నీ ప్రారంభించారుఈ కార్యక్రమంలోచిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్.విభిన్న ప్రతిభావంతుల, హిజ్రా వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు వి. పుల్లారెడ్డి, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఏ. మురళి, డెఫ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హేమంత్, సంబంధిత అధికారులు, బధిరుల సంఘాల ప్రతినిధులు, బధిరులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ సమాన గౌరవం, అవకాశాలు పొందేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. బధిరులు, విభిన్న ప్రతిభావంతులు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే, వాటి పరిష్కారానికి ప్రభుత్వ పరంగా, తన వంతుగా అవసరమైన సహకారం అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఇంటి స్థలం వంటి సమస్యలు ఉన్న అర్హుల వివరాలను తనకు అందించాలని, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అలాగే బధిరులు, విభిన్న ప్రతిభావంతుల కోసం ఆరోగ్య శిబిరాలను నిర్వహించి అవసరమైన వైద్య సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి ఒక్కరికీ అవసరమైన సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలు అందేలా అధికారులుసమన్వయంతో పనిచేయాలని కోరారు.
ఈ కార్యక్రమానికి హాజరైన నందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. బధిరులు సమాజంలో సమాన అవకాశాలతో ముందుకు సాగేందుకు అవసరమైన సహాయాన్ని అందించడంతో పాటు, వారి ప్రతిభను గుర్తించి అవసరం ఉందని ప్రోత్సహించాల్సిన పేర్కొన్నారు.విభిన్న ప్రతిభావంతుల, హిజ్రా వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు వి. పుల్లారెడ్డి మాట్లాడుతూ బధిరుల హక్కులు, వారి సంస్కృతి, సామర్థ్యాలు విజయాలపై సమాజంలో అవగాహన పెంపొందించడమే అంతర్జాతీయ బధిరుల దినోత్సవ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమన్నారు.1958 నుంచి సెప్టెంబర్ 22 నుంచి 28వ తేదీ వరకుబధిరులవారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వారోత్సవాల్లో బధిరుల హక్కులు, సంకేత భాష హక్కులు, సమాజంలో వారి భాగస్వామ్యం, సమాన అవకాశాలపై అవగాహన కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపాడు
సంకేత భాష బధిరుల మధ్య భావవ్యక్తీకరణకు మాత్రమే పరిమితం కాకుండా, బధిరులు కాని వారు కూడా దానిపై కనీస అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరమని పుల్లారెడ్డి పేర్కొన్నారు. సంకేత భాష( బ్రెయిన్ లిపి) పై అవగాహన పెరిగినప్పుడు బధిరులు తమ సమస్యలు, అభిప్రాయాలు, అవసరాలను సమర్థవంతంగా ఇతరులకు తెలియజేయగలరని, తద్వారా సమాజంలో పరస్పర అవగాహన, సహానుభూతి మరింత పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఏ. మురళి, డెఫ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హేమంత్, సంబంధిత అధికారులు, బధిరుల సంఘాల ప్రతినిధులు, బధిరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!