సత్యవేడు సెప్టెంబర్ 29 గరుడధాత్రి :
సత్యవేడు నియోజకవర్గ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిగా సత్యవేడు మండలం పేరడం గ్రామానికి చెందిన సానాటి నాగరాజు ముదిరాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు ముదిరాజ్ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు చప్పిడి కృష్ణమోహన్ నియామక పత్రాన్ని చరవాణి ద్వారా నాగరాజుకు అందజేశారు.
నియోజకవర్గ పరిధిలో ముదిరాజ్ సంఘాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, సామాజికవర్గ సభ్యులను ఐక్యంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యతను నాగరాజుకు అప్పగించినట్లు సంఘం నాయకులు తెలిపారు.
పార్టీలకు అతీతంగా ముదిరాజ్ సామాజికవర్గ అభివృద్ధి, ఐక్యత కోసం కృషి చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు చప్పిడి కృష్ణమోహన్ సూచించారు. సంఘం ఆశయాలకు అనుగుణంగా సభ్యులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని కోరారు.
తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, సత్యవేడు నియోజకవర్గంలో ముదిరాజ్ సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని సానాటి నాగరాజు తెలిపారు.
