ePaper
Tuesday, September 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిప్రముఖ శైవక్షేత్రమైన మల్లప్పకొండ వద్ద బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్న 8 మందికి...

ప్రముఖ శైవక్షేత్రమైన మల్లప్పకొండ వద్ద బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్న 8 మందికి జరిమానా

📰 Generate e-Paper Clip

కుప్పం సెప్టెంబర్ 28 గరుడ దాత్రి న్యూస్

గుడుపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మల్లప్పకొండ వద్ద కొంతమంది వ్యక్తులు బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తూ, ప్రజలకు ఇబ్బందికరంగా మరియు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారన్న నమ్మదగిన సమాచారంతో గుడుపల్లి ఎస్సై వారి సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని ముందుగా ఎమ్మార్వో , గుడుపల్లి వద్ద బైండోవర్ చేసి, అనంతరం కేసులు నమోదు చేసి గౌరవ _క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు, కుప్పం లో ప్రవేశపెట్టగా, గౌరవ న్యాయమూర్తి గారు 8 మందిని దోషులుగా నిర్ధారించి, బి.ఎన్.ఎస్ సెక్షన్ 355 & 292 కింద ఒక్కొక్కరికి రూ. 1000/- చొప్పున జరిమానా విధించారు. పవిత్ర పుణ్యక్షేత్రాల వద్ద, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని, ఇటువంటి చర్యలపై రాబోయే రోజుల్లో కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడమైనది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!