ePaper
Tuesday, October 6, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతివెంగమవారిపల్లి రైతు పొలంలోని టమోటా పంటపై దాడి చేసిన ఒంటరి ఏనుగు

వెంగమవారిపల్లి రైతు పొలంలోని టమోటా పంటపై దాడి చేసిన ఒంటరి ఏనుగు

📰 Generate e-Paper Clip

బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్2

బైరెడ్డిపల్లి మండలంలోని వెంగం వారిపల్లి గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు ,మాజీ ఎంపిటిసి రైతు పొలంలోకి గురువారం రాత్రి ఒంటరి ఏనుగు చొరబడి తొడుగులు సాయంతో ఏర్పాటు చేసిన టమోటా తోటపై దాడి చేసి నష్టం చేకూర్చింది. వేకువ జామునే గమనించిన రైతన్న సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. గడిచిన మూడు నెలలుగా ఏనుగులు రైతన్న పంట పొలాల మీదకు వస్తున్నాయని, వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదని రైతన్న వాపోయారు. గడిచిన మూడు నెలలుగా అటవీ సరిహద్దు గ్రామాలైనటువంటి కల్లిగుట్ట, వెంగం వారి పల్లి, కుప్పనపల్లి, కడతట్లపల్లి,గౌనీతిమ్మినేపల్లి,కడపనత్తం గ్రామాల వ్యవసాయ పాలాల్లోని పంటల పై క్రమం తప్పకుండా ఏనుగులు బీభత్సం సృష్టిస్తూనే ఉన్నాయి కానీ సంబంధిత శాఖ అధికారులు విధిగా వచ్చి సమాచారం సేకరించి వెళ్తున్నారే తప్ప వాటి కట్టడి కోసం శాశ్వత పరిష్కారం కు పూనుకోలేదని గ్రామాల ప్రజలు వాపోతున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!