ePaper
Monday, October 5, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతివేటరాయ స్వామి కొండ వద్ద అన్న ప్రసాదం పంపిణీకి చురుగ్గా ఏర్పాట్లు.

వేటరాయ స్వామి కొండ వద్ద అన్న ప్రసాదం పంపిణీకి చురుగ్గా ఏర్పాట్లు.

📰 Generate e-Paper Clip

చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 02 (ఆర్.శ్రీనివాసులు,గరుడ ధాత్రి న్యూస్): కుప్పం సమీపంలోని పరమ సముద్రం బేటరాయ స్వామి కొండ వద్ద శనివారం భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ కోసం చురుగ్గా ఏర్పాట్లు చేపడుతున్నారు. శుక్రవారం సాయంత్రమే ప్రసాదాలు తయారీకి కను పూజా కార్యక్రమం నిర్వహించారు. మూడో తేదీ శనివారం ఉదయం 10 గంటలకు టిటిడి ఆధ్వర్యంలో శ్రీవారి కల్యాణోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు కర్ణాటక తమిళనాడు ఆంధ్ర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తారు. భక్తులకు అవసరమైన తాగునీరు ప్రసాదం వంటి ఏర్పాట్లను నిర్వాహకులు చురుగ్గా చేయబడుతున్నారు. శుక్రవారం సాయంత్రం ప్రసాదం తయారీకి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు కార్యదర్శి పి మనోహర్, టిటిడి పాలకమండలి సభ్యులు శాంతారామ్, మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ మణి, టిడిపి యువ నాయకుడు సంతోష్, సమీప గ్రామ పెద్దలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!