ePaper
Monday, October 5, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిరాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన పలమనేరు.. మున్సిపాలిటీకి ప్రతిష్ఠాత్మక ‘స్వచ్ఛాంధ్ర అవార్డు

రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన పలమనేరు.. మున్సిపాలిటీకి ప్రతిష్ఠాత్మక ‘స్వచ్ఛాంధ్ర అవార్డు

📰 Generate e-Paper Clip

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పురస్కారం అందుకున్న కమిషనర్ లోకేశ్వర వర్మ

*పలమనేరు, అక్టోబర్ 02 ( గరుడ ధాత్రి ) :*
పలమనేరు మున్సిపాలిటీ పారిశుద్ధ్య నిర్వహణలో సత్తా చాటింది. 50 వేల నుంచి లక్ష జనాభా విభాగంలో ప్రతిష్ఠాత్మక ‘స్వచ్ఛాంధ్ర అవార్డు 2026’ను కైవసం చేసుకుని రాష్ట్ర స్థాయిలో ఆదర్శంగా నిలిచింది. శుక్రవారం విజయవాడలోని ఏ-కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పలమనేరు మున్సిపల్ కమిషనర్ కె.లోకేశ్వర వర్మ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఇది కేవలం పురస్కారం మాత్రమే కాదని, పారిశుద్ధ్య కార్మికుల చెమటకు, పలమనేరు పౌరుల బాధ్యతాయుత ప్రవర్తనకు దక్కిన సముచిత గౌరవమని పేర్కొన్నారు. స్థానిక శాసనసభ్యులు ఎన్. అమరనాథ్ రెడ్డి మార్గదర్శనం, ప్రోత్సాహం వల్లే ఈ విజయం సాధ్యమైందని స్పష్టం చేశారు.

*పకడ్బందీ వ్యర్థాల నిర్వహణ:*
పట్టణంలో 100% ఇంటింటా చెత్త సేకరణ, మూలంలోనే తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాల వర్గీకరణ పక్కాగా అమలు చేస్తున్నారు. తడి చెత్తతో కంపోస్ట్ తయారీ, ఏళ్ల తరబడి పేరుకుపోయిన లెగసీ వ్యర్థాల నిర్మూలన చేపట్టారు.

* **నీటి శుద్ధి & ఈ-వేస్ట్:** డ్రైన్ల పూడికతీతతో పాటు, మురుగునీటిని నేరుగా వదలకుండా మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) ద్వారా శుద్ధి చేసి పునర్వినియోగానికి సిద్ధం చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాల సురక్షిత డిస్పోజల్‌కు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
*
* **ఆర్ఆర్ఆర్ కేంద్రాలు:** రీడ్యూస్, రీయూజ్, రీసైకిల్ విధానంతో పాత వస్తువులను సేకరించి పునర్వినియోగంలోకి తేవడంతో పాటు, వ్యర్థాలతో కళాకృతుల తయారీని ప్రోత్సహించారు.
*
* **హరిత పలమనేరు – ప్రజా చైతన్యం:** ‘ప్రతి పౌరుడికి ఒక మొక్క’ నినాదంతో సామూహిక వృక్షారోపణ చేపట్టారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పిస్తూ, జనపనార సంచుల వాడకాన్ని ప్రోత్సహించారు. స్వయం సహాయక సంఘాల మహిళల భాగస్వామ్యంతో హోమ్ కంపోస్టింగ్, మిద్దె తోటల పెంపకాన్ని ఉద్యమంగా మార్చారు.

**కార్మికుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం**
ఈ విజయంలో వెన్నెముకగా నిలిచిన మున్సిపల్ పబ్లిక్ హెల్త్ వర్కర్ల శ్రేయస్సు కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి వారి ఆరోగ్యానికి భరోసా కల్పించినట్లు కమిషనర్ తెలిపారు. “స్వచ్ఛతా హీ సేవా”, “సాసా” వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించామన్నారు. ఈ గుర్తింపునిచ్చి ప్రోత్సహించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రిన్సిపల్ సెక్రటరీ, సీడీఎంఏ ఉన్నతాధికారులకు, జిల్లా కలెక్టర్‌కు, స్వచ్ఛ ఆంధ్ర అధికారులకు కమిషనర్ లోకేశ్వర వర్మ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు తమ బాధ్యతను మరింత పెంచిందని, ఇదే స్ఫూర్తితో పలమనేరును రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన, సంపూర్ణ ఆరోగ్యకర హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు పునరంకితం అవుతామని ఆయన పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!