ePaper
Saturday, October 3, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపోషక ఆహారాలు ఆరోగ్యంకు శ్రీరామరక్ష

పోషక ఆహారాలు ఆరోగ్యంకు శ్రీరామరక్ష

📰 Generate e-Paper Clip

*వైద్యాధికారి విజయచందర్

బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్3

బైరెడ్డిపల్లి ఐసిడిఎస్ ప్రాజెక్ట్
బైరెడ్డిపల్లి 1. వ అంగన్వాడీ కేంద్రం నందు శనివారం అంగన్వాడీ ఉత్సవం కార్యక్రమము నిర్వహించడం జరిగినది. సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుండి అక్టోబర్ 7వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగించడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో బైరెడ్డిపల్లి పి.హెచ్ సి. వైద్యాధికారి విజయచంద్రర్ మరియు ఆశా కార్యకర్తలు ముబీనా రాజేశ్వరి, జయమ్మ భారతి అంగన్వాడీ కార్యకర్త నిర్మల సహాయకురాలు దీప మరియు గర్భవతులు బాలింతలు పిల్లల తల్లులు యుక్త వయసు బాలికలు పాల్గొన్నారు. వైద్యాధికారి విజయచందర్ మాట్లాడుతూ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశముచిన్నపిల్లలు ,
గర్భవతులు మరియు బాలింతలలో పోషకాహార లోపాలు నివారించడం కోసం ప్రభుత్వం నిర్వహించే ఒక ప్రత్యేక కార్యక్రమం పై అవగాహన కల్పించారు. ఈ యొక్క కార్యక్రమం ప్రతిరోజు ఒక అంశంతో విభిన్న రకమైన కార్యక్రమాలుగా నిర్వహిస్తూ పౌష్టికాహారం తినండి ఆరోగ్యంగా ఉండండి అనిఆయన తెలిపారు . ఆహారంలో వైవిధ్యం గురించి, విటమిన్లు, ఆవిరిఅయిపోకుండా వండే విధానం గురించి మరియు పోషక విలువ సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో ఉండేలా చూసుకోవడం వలన ఆరోగ్యం చేకూరుతుందని ప్రజలలో అవగాహన కల్పిస్తూ పౌష్టికాహారం యొక్క ఆవశ్యకతను ప్రజలకు తెలియజేస్తూ సామాజిక భాగస్వామ్యం తో ఈ కార్యక్రమము కొనసాగిస్తున్నామని తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!