చౌడేపల్లి అక్టోబర్ 03 గరుడదాత్రి న్యూస్
పోయిందనుకున్న బంగారం గొలుసు లభ్యం కావడంతో స్వామివారి వద్దకు వచ్చి ప్రత్యేక పూజలు చేశారు బాధిత వ్యక్తి కథనం మేరకు…
పీలేరు గ్రామానికి చెందిన గ్రామస్తులు ఈ నెల 19న 30 గ్రాముల బంగారు గొలుసును ప్రమాణం చేయడానికి వచ్చి రసీదు పొందిన సంఘటన తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 3వ తేదీన తిరిగి ప్రమాణకానికి వస్తామని గ్రామంలో చెప్పగా, సదరు గొలుసును ఇంట్లోనే ఉంచి వెళ్లిపోయారు.
అయితే, ఈ రోజు సదరు వ్యక్తుల కుమారులు ఇద్దరూ దేవస్థానానికి విచ్చేశారు. ఇంట్లో ఉంచిన 30 గ్రాముల బంగారు గొలుసు సురక్షితంగా దొరకడంతో, దేవస్థాన సన్నిధికి తీసుకువచ్చి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ప్రసన్న ఆంజనేయస్వామి లకు అర్చకులతో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. అనంతరం ఆభరణాన్ని భద్రంగా తీసుకుని స్వగ్రామానికి పయనమయ్యారు. ఈ విషయమై స్థానిక గ్రామస్తులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు.
