ePaper
Saturday, October 3, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపిచ్చాటూరులో 20వ సామాజిక తనిఖీ బహిరంగ సభ

పిచ్చాటూరులో 20వ సామాజిక తనిఖీ బహిరంగ సభ

📰 Generate e-Paper Clip

పిచ్చాటూరు, అక్టోబర్ 3 గరుడధాత్రి

పిచ్చాటూరు మండల కార్యాలయ ఆవరణంలో శనివారం 20వ సామాజిక తనిఖీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా నీటి యాజమాన్య పథక సంచాలకులు ఎం.సి. మద్దులేటి ప్రిసైడింగ్ అధికారిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పుత్తూరు క్లస్టర్ సహాయ పథక సంచాలకులు జి. వరప్రసాద్, పిచ్చాటూరు ఎంపీడీవో ఎస్.ఏ. మహమ్మద్ రఫీ, ఎస్‌ఆర్‌పీ వెంకయ్య, ఏవీఓ గణేష్, జేక్యూసీ శ్రీనివాసులు, ఏపీవో వి.బి.జి. రామ్‌జీ, ఇన్‌చార్జ్ పీఆర్‌ఏఈ సతీష్, డీఆర్‌పీలు, వి.బి.జి. రామ్‌జీ సిబ్బంది, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
సామాజిక తనిఖీలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, వాటి అమలు తీరు, రికార్డులు తదితర అంశాలను పరిశీలించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!