*చిత్తూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు, మాజీ ఎం.ఎల్.ఏ. వెంకటేగౌడు*
బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్8
వైకాపా కోసం కష్టకాలంలో పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు, ప్రోత్సాహం ఇస్తామని చిత్తూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు, మాజీ ఎం.ఎల్.ఏ. వెంకటేగౌడు పేర్కొన్నారు. ఆయన జిల్లా రథసారధిగా నియామకం అయిన తరువాత బైరెడ్డిపల్లి మండలం తీర్థం గ్రామం కు గురువారం విచ్చేయగా మండల ముఖ్య నాయకులు,వైకాపా శ్రేణులు ఘనస్వాగతం పలికి పూలమాలలు,శాలవులతో సత్కరించి ఆయనను అభినంధించి శుభాకాంక్షలు తెలియజేశారు
అనంతరం తీర్థం గ్రామం పార్శం కృష్ణవేణమ్మ కళ్యాణ మండపంలో ఆయన అధ్యక్షతన వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు కార్డులు అందజేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామస్థాయిలో పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, నాయకులు, కార్యకర్తల సమన్వయంపై సమావేశంలో చర్చించారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు, ప్రోత్సాహం అందిస్తామని వెంకటేగౌడ గారు తెలిపారు. కార్యక్రమంలో మండలం మఖ్యనాయకులు, మొగశాల సోదరులు కృష్ణమూర్తి, రెడెప్ప,మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, పార్టీ కమిటీ సభ్యులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
