ePaper
Friday, October 9, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిగర్భవతులు, బాలింతలు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల పిల్లలు చక్కటి ఎదుగుదల సాధ్యం -...

గర్భవతులు, బాలింతలు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల పిల్లలు చక్కటి ఎదుగుదల సాధ్యం – సి.డి.పి.ఓ.అరుణశ్రీ

📰 Generate e-Paper Clip

బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్8
బైరెడ్డి పల్లి మండలంలోని కమ్మనపల్లి అంగన్వాడి కేంద్రం నందు సిడిపిఓ అరుణశ్రీ ఆధ్వర్యంలో సూపర్వైజర్ మాధవి లత పోషణ్ మా, కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిడిపిఓ అరుణశ్రీ మాట్లాడుతు వైవిద్య భరితమైన ఆహారం తీసుకోవాలని పోషణ వల్ల బాలలు ఆరోగ్యంగా ఎదుగుతారని అలాగే గర్భవతులు బాలింతలు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకోవడంవల్ల పిల్లలుఆరోగ్యంగానూ మంచి మనోవికాసంతో ఎదిగి భవిష్యత్తును ప్రకాశవంతం చేసుకుంటారని తెలిపారు. ఈ నేపథ్యంలో సమాజం దేశం మరింత ఉజ్వలంగా ఉంటాయని పేర్కొన్నారు.
ఈకార్యక్రమంలో సూపర్వైజర్ మాధవి లత ఏఎన్ఎం ప్రైమరీ స్కూల్ టీచర్స్ మరియు ఆశ అంగన్వాడీ కార్యకర్తలు లబ్ధిదారులు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!