ePaper
Friday, October 9, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపలమనేరు మార్కెట్ కమిటీకి జిల్లా స్థాయి ‘స్వచ్ఛ ఆంధ్ర అవార్డు - 2026

పలమనేరు మార్కెట్ కమిటీకి జిల్లా స్థాయి ‘స్వచ్ఛ ఆంధ్ర అవార్డు – 2026

📰 Generate e-Paper Clip

**చైర్మన్ రాజన్న, సెక్రటరీ సంజీవ్ కుమార్, సిబ్బందిని అభినందించిన ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి

*పలమనేరు, అక్టోబర్ 08 ( గరుడ ధాత్రి ) :

పలమనేరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ జిల్లా స్థాయిలో ప్రతిష్టాత్మక ‘స్వచ్ఛ ఆంధ్ర అవార్డు – 2026’ దక్కించుకోవడం పట్ల స్థానిక శాసనసభ్యులు ఎన్. అమరనాథ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డు ప్రాంగణంలో పారిశుద్ధ్య నిర్వహణ, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పనలో చూపిన చొరవకు ఈ గుర్తింపు లభించిందని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, సెక్రటరీ సంజీవ్ కుమార్ మరియు కార్యాలయ సిబ్బందిని ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి శాలువాలు కప్పి, ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ—మార్కెట్‌కు వచ్చే రైతులు, వ్యాపారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తూనే, యార్డును పరిశుభ్రంగా ఉంచడంలో పాలకవర్గం, అధికారులు, సిబ్బంది చూపిన అంకితభావం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలోనూ అవార్డును కైవసం చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం చైర్మన్ రాజన్న, సెక్రటరీ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ—ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి సహకారం, మార్గదర్శకత్వంతో మార్కెట్ కమిటీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ అవార్డు దక్కడం సిబ్బంది సమిష్టి కృషికి నిదర్శనమని, సహకరించిన పాలకవర్గ సభ్యులు, రైతులు, వ్యాపారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ నదీమ్, నాయకులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!