ePaper
Saturday, October 10, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతివిద్యార్థుల సమగ్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనున్న క్రీడలు

విద్యార్థుల సమగ్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనున్న క్రీడలు

📰 Generate e-Paper Clip

* బిసీఎన్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ బిసి నాగరాజ్.
* కుప్పం ఇంజినీరింగ్ కళాశాలలో జేఎన్‌టీయూఏ మహిళల షటిల్ బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు ప్రారంభం.
కుప్పం, అక్టోబర్ 10 గరుడ ధాత్రి న్యూస్: కుప్పం ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలోని సచిన్ టెండూల్కర్ ఇండోర్ స్టేడియంలో శనివారం జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, అనంతపురం మహిళల షటిల్ బ్యాడ్మింటన్ జట్టు ఎంపిక పోటీలను ఘనంగా ప్రారంభించారు. 2026–27 విద్యా సంవత్సరానికి నిర్వహిస్తున్న ఈ ఎంపిక పోటీలను కుప్పం ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బీసీఎన్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ వ్యవస్థాపకులు, చైర్మన్ డా. బి.సి. నాగరాజ్ వైస్ చైర్మన్ డా. ఎన్. సునీల్ రాజ్ మార్గదర్శకత్వం అందించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్. సుధాకర్ బాబు వైస్ ప్రిన్సిపాల్ డా. ఎస్. భాస్కరన్ పర్యవేక్షణలో కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా చైర్మన్ డా. బి.సి. నాగరాజ్ మాట్లాడుతూ, విద్యార్థుల సమగ్ర అభివృద్ధిలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
వైస్ చైర్మన్ డా. ఎన్. సునీల్ రాజ్ మాట్లాడుతూ, విశ్వవిద్యాలయ స్థాయి ఎంపిక పోటీలు క్రీడాకారులు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు చక్కని వేదికగా నిలుస్తాయని అన్నారు. ముఖ్యంగా మహిళా క్రీడాకారిణులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి, ఉన్నత స్థాయి పోటీల్లో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు కళాశాల ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు.కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్. సుధాకర్ బాబు మాట్లాడుతూ, జేఎన్‌టీయూఏ మహిళల షటిల్ బ్యాడ్మింటన్ ఎంపిక పోటీల నిర్వహణ బాధ్యతను తమ కళాశాలకు అప్పగించడం గర్వకారణమని పేర్కొన్నారు. పోటీలను నిష్పక్షపాతంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఈ ఎంపిక పోటీలకు జేఎన్‌టీయూ అనంతపురం స్పోర్ట్స్ కౌన్సిల్ కార్యదర్శి ప్రొఫెసర్ టి. నారాయణ రెడ్డి యూనివర్సిటీ అబ్జర్వర్‌గా హాజరయ్యారు. జేఎన్‌టీయూఏ ఫిజికల్ డైరెక్టర్ బి. జోజి రెడ్డి ఎంపిక కమిటీ సభ్యునిగా వ్యవహరించారు. నిర్వహణ కమిటీ:కళాశాల ఫిజికల్ డైరెక్టర్ సి. సతీష్ కుమార్ కన్వీనర్‌గా వ్యవహరించగా, నిర్వహణ కమిటీలో భాగంగా డా. సి.జి. శరవణ, వి. సత్యమూర్తి, డా. పి. అజయ్ కుమార్ రెడ్డి, వివేక్, వి. పాండియన్, పి. సుధాకర్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఎంపిక పోటీలకు అవసరమైన క్రీడా సదుపాయాలు, మౌలిక వసతులు, ఇతర ఏర్పాట్లను సమన్వయం చేశారు.
కళాశాలలోని వివిధ విభాగాల విభాగాధిపతులు, సెక్షన్ ఇన్‌చార్జీలు, బోధన మరియు బోధనేతర సిబ్బంది కార్యక్రమ నిర్వహణకు సహకరించారు. విద్యార్థులు కూడా వివిధ ఏర్పాట్లలో చురుకుగా పాల్గొని, క్రీడాకారిణులకు అవసరమైన సహాయ సహకారాలు అందించారు. అందరి సమన్వయంతో కార్యక్రమం సజావుగా ప్రారంభమైంది.క్రీడాకారిణులకు ప్రోత్సాహం:ఈ ఎంపిక పోటీల ద్వారా ప్రతిభావంతులైన మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణులకు విశ్వవిద్యాలయ జట్టులో స్థానం సంపాదించేందుకు అవకాశం లభించింది. క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, పట్టుదలతో పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని నిర్వాహకులు క్రీడాకారిణులకు సూచించారు.
విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను పెంపొందిస్తూ, రాష్ట్ర మరియు జాతీయ స్థాయి పోటీల్లో రాణించేలా ప్రోత్సహించేందుకు కుప్పం ఇంజినీరింగ్ కళాశాల కట్టుబడి ఉందని కళాశాల ప్రతినిధులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!