ePaper
Tuesday, October 27, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతియు.పి.హెచ్.సి కి గోడ గడియారం బహూకరణ

యు.పి.హెచ్.సి కి గోడ గడియారం బహూకరణ

📰 Generate e-Paper Clip

పలమనేరు, అక్టోబర్ 26, గరుడ ధాత్రి :
స్థానిక గంటాఊరు కాలనీ నందు ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (యు.పి.హెచ్.సి) హాస్పిటల్‌లో క్రిష్ణమ్మ గారి జీవనధార ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మౌనిక సెల్లస్ ని ఫౌండేషన్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు క్రిష్ణమ్మ గారి జనార్ధన్ మరియు సభ్యులు కలిసి హాస్పిటల్ అవసరాల నిమిత్తం ఒక గోడ గడియారాన్ని (వాల్ క్లాక్) మెడికల్ ఆఫీసర్ మౌనిక సెల్లస్ కి అందజేశారు. సమాజ సేవలో భాగస్వామ్యం కావడం, ప్రభుత్వ వైద్యులను ప్రోత్సహించడం అభినందనీయమని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు కే.ఎం. చరణ్, చంద్రమౌళి, సుబ్రహ్మణ్యంలతో పాటు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!