ePaper
Thursday, October 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిగంగవరం మండల జడ్పిటిసి కాంగ్రెస్ అభ్యర్థిగా జి సునీత వినూత్న ప్రచారం

గంగవరం మండల జడ్పిటిసి కాంగ్రెస్ అభ్యర్థిగా జి సునీత వినూత్న ప్రచారం

📰 Generate e-Paper Clip

పలమనేరు, అక్టోబరు 28 గరుడధాత్రి :
గంగవరం మండల జడ్పిటిసి కాంగ్రెస్ అభ్యర్థిగా జి సునీత వినూత్నముగా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మండలంలోని చిన్నూరు గ్రామానికి చెందిన సునీత అందరికీ సుపరిచితమే, గతంలో గంగవరం మండలంలోని ఇసుక మాఫియా మట్టి మాఫియా మరియు ప్రజల సమస్యల పట్ల నిర్భయంగా పోరాడి, తప్పుదారిలో వెళ్తున్న రెవిన్యూ పోలీస్అధికారులను నిలదీసి ధైర్యంగా పోరాడి ప్రజలకు వెన్ను గా నిలిచిన మహిళ సునీత. ఈమె ధైర్య సాహసాలను మెచ్చి, సేవా గుణాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సునీతను ప్రత్యక్షంగా జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేయాలని ఆదేశించడంతో పిలుపునివ్వడంతో, వారి పిలుపును మన్నించి కాంగ్రెస్ కండువా కప్పుకొని గంగవరం మండలం జడ్పిటిసి అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఆమెను ఆదరించాలని ఆమె ఇంటింట ప్రచారం కొనసాగిస్తున్నది. మండలంలోని ప్రజలు వారి అమూల్యమైన ఓటు హస్తం గుర్తుకు వేసి అఖండమైన మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. ఒక్కసారి ప్రజలు ఆదరిస్తే జీవితాంతం ప్రజా సమస్యల కోసం పోరాడి, ప్రజల వైపు నిలబడి అభివృద్ధికి బాటలేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!