ePaper
Thursday, October 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతితీర్థంలో పొగాకు రహిత దేశం కోసం యువ ప్రచార ర్యాలీ

తీర్థంలో పొగాకు రహిత దేశం కోసం యువ ప్రచార ర్యాలీ

📰 Generate e-Paper Clip

బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్28

బైరెడ్డిపల్లి మండలం లోని తీర్థం గ్రామంలో బుధవారం పొగాకు రహిత దేశం కోసం యువ ప్రచార ర్యాలీ నిర్వహించారు.
ఈసందర్భంగా తీర్థం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు వైద్యాధికారి పద్మా వతి ఆధ్వర్యంలో అవగాహన ,మరియు ర్యాలీ చేయడం జరిగింది.ముఖ్యంగా పిల్లలు,యువత పొగాకు వ్యతిరేక నినాదాలు చేస్తూ ,ఆరోగ్యకరమైన భవిశ్యత్తును ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. చుట్టూ ,బీడీ, సిగరెట్టు ప్రాణానికి పెనుముప్పు అని పొగత్రాగడం వల్ల క్యాన్సర్, ధూమ పానం వలన గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులకు గురి అవు తారని ,సిగరెట్ కాల్చడం వల్ల ఆయుస్సు తగ్గిస్తుందని, బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేయకూడదని పేర్కొన్నారు. డిప్యూటీ హెచ్.ఈ.ఓ. కాంతమ్మ మాట్లాడుతూ పొగాకు రహిత దేశంగా మారాలన్నదే ముఖ్య ఉద్దేశం అని చెప్పడం జరిగింది. అలాగే హైస్కూల్ విద్యార్థులు చేత ర్యాలీ, మరియు ప్రతిజ్ఞ చేయిచడం జరిగింది. ఈ కార్య క్రమంలో ఎల్.టి. హరి,రాజారెడ్డి, ఆయుబ్, సుమిత్ర, లక్ష్మి, సాయి దివ్య, నవీన ఆశ విద్యార్ధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!