ePaper
Thursday, October 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిప్రచార వాహనాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి

ప్రచార వాహనాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి

📰 Generate e-Paper Clip

బైరెడ్డిపల్లి, గరుడదాత్రి అక్టోబరు 28

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచార వాహనాలకు పలమనేరు రెవెన్యూ డివిజనల్ అధికారి నుంచి ముందస్తు అనుమతి పొందాలని రిటర్నింగ్ అధికారి ఎన్. వెంకటరాముడు, సహాయ రిటర్నింగ్ అధికారి, ఎంపీడీఓ కె. ఆనందబాబు, తహసిల్దార్ ప్రసన్న కుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
వాహనాల నంబర్లు, ప్రచారం నిర్వహించే ప్రాంతాలు, వినియోగించే తేదీల వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనుమతి పొందిన అనంతరమే వాహనాలను వినియోగించాలని, అసలు అనుమతి పత్రాన్ని వాహనం ముందు అద్దంపై స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని పేర్కొన్నారు.
ప్రచార కాన్వాయ్‌లో రెండు వాహనాలకు మించి ఉండరాదని, వాహనాల ఖర్చులను అభ్యర్థుల ఎన్నికల వ్యయ ఖాతాలో నమోదు చేయాలని తెలిపారు. పోలింగ్ ముగిసే సమయానికి ముందు 48 గంటల నిషేధిత వ్యవధిలో వాహనాల ద్వారా ఎన్నికల ప్రచారం చేయరాదని స్పష్టం చేశారు.
నవంబరు 3న పోలింగ్ రోజున ఎంపీటీసీ అభ్యర్థికి ఒక వాహనం, జడ్పీటీసీ అభ్యర్థికి మొత్తం రెండు వాహనాలు మాత్రమే అనుమతిస్తారని, ఇందుకు పలమనేరు ఆర్డీఓ కార్యాలయం నుంచి ప్రత్యేక పోలింగ్‌ రోజు అనుమతులు పొందాలని తెలిపారు. ఎంపీటీసీ అభ్యర్థి ఏజెంట్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు అదనపు వాహనం అనుమతించరాదని పేర్కొన్నారు.
అభ్యర్థులు లేదా వారి తరఫున ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు ఉచితంగా తరలించేందుకు వాహనాలు ఏర్పాటు చేయడం నిషేధమని, అనుమతులు లేకుండా వాహనాలను వినియోగించినా, నిబంధనలు ఉల్లంఘించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!