చిత్తూరు బ్యూరో,కుప్పం నవంబర్ 01 (ఆర్.శ్రీనివాసులు,గరుడ ధాత్రి న్యూస్): కుప్పం మున్సిపల్ ఎన్నికల బరిలో చైర్మన్గా రంగంలో ఉన్న ఎస్. రాజ్ కుమార్ తన ఓటు హక్కును కుటుంబ సభ్యులతో కలిసి వినియోగించుకున్నారు. మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఆదివారం కుప్పం మున్సిపాలిటీకి చైర్మన్ మరియు కౌన్సిలర్లకు పోలింగ్ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ కుప్పం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా రంగంలో ఉన్న ఎస్ .రాజ్ కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజ్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
