చిత్తూరు బ్యూరో, కుప్పం నవంబర్ 01(ఆర్.శ్రీనివాసులు,గరుడ ధాత్రి న్యూస్): మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ను తెలుగుదేశం పార్టీ నాయకులు పర్యవేక్షించారు. మున్సిపాలిటీకి ఆదివారం పోలింగ్ జరిగిన విషయం విధితమే .కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ,ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పి.ఎస్ .మునిరత్నం, ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, హుడా చైర్మన్ డాక్టర్ బి.ఆర్. సురేష్ బాబు, మున్సిపల్ టిడిపి చైర్మన్ అభ్యర్థి రాజ్ కుమార్, రెస్కో చైర్మన్ ప్రతాప్ కుమార్ ,టిడిపి చైర్మన్ అభ్యర్థి జనరల్ ఏజెంట్ డాక్టర్ వి వెంకటేష్, చంద్రబాబు కార్యదర్శి శ్రీకాంత్, మాజీ ఏఎంసీ చైర్మన్ సత్యేంద్ర శేఖర్, అర్బన్ పార్టీ అధ్యక్షులు వెంకటేష్ లు పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ,కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమన్నారు. ఓటర్లందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
కుప్పం మున్సిపాలిటీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వార్డులను పరిశీలించి, పోలింగ్ ఏజెంట్లకు పలు సూచనలు చేయడం జరిగింది. ప్రతి ఓటరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించి, 100 శాతం పోలింగ్ నమోదయ్యేలా కృషి చేయాలని సూచించడం జరిగింది. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేలా అప్రమత్తంగా ఉండాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుప్పం మున్సిపల్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఆర్. శ్రీనివాసులు పాల్గొన్నారు.
