ePaper
Sunday, June 14, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్రామగిరిలో భక్తి ప్రపత్తులతో ఆదివారం అమావాస్య పూజలు

రామగిరిలో భక్తి ప్రపత్తులతో ఆదివారం అమావాస్య పూజలు

📰 Generate e-Paper Clip

పిచ్చాటూరు మండలం రామగిరి లో వెలసియున్న శ్రీ అంకాలపరమేశ్వరి ఆలయంలో ఆదివారం అమావాస్య ను పురస్కరించుకొని రాత్రి ప్రత్యేక అమావాస్య పూజలు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా సాయంత్ర అమ్మవారి మూల విరాట్ కు ప్రత్యేకంగా పంచామృతాలతో అభిషేకించి, గజ మాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
అందంగా అలంకరించిన అమ్మవారి ఉత్సవ మూర్తిని ఆలయ ఊంజల్ మండపంలో ఉయ్యాల పై అధిష్టించి ఊంజల్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయంలో మంగళ వాయిద్యాలు, చిన్నారుల పండరి భజన ఆకర్షణగా నిలిచింది.
ఆదివారం అమావాస్య పూజలకు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నారు.
భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా నిర్వాహకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!