ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అఖండ భారతావని ముద్దుబిడ్డ డాక్టర్ బి ఆర్ అంబేత్కర్

అఖండ భారతావని ముద్దుబిడ్డ డాక్టర్ బి ఆర్ అంబేత్కర్

📰 Generate e-Paper Clip

*అఖండ భారతావని ముద్దుబిడ్డ డాక్టర్ బి ఆర్ అంబేత్కర్*

 

✍️ *ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం*

 

✍️ *ఘనంగా బాబా సాహెబ్ అంబేత్కర్ జయంతి వేడుకలు*

 

✍️ *పుత్తూరు, నారాయణవనంలో అంబేత్కర్ విగ్రహలకు ఎమ్మెల్యే నివాళి*

 

అఖండ భారతావని ముద్దుబిడ్డ డాక్టర్ బి ఆర్ అంబేత్కర్ అని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కొనియాడారు.

 

మంగళవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేత్కర్ జయంతిని పురస్కరించుకొని ఉదయం 8 గంటలకు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పుత్తూరు లోని అంబేత్కర్ భవన్ కు చేరుకొని బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి గజ మాలతో ఘనంగా నివాళి అర్పించారు.

 

అనంతరం అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశానికి సురక్షితమైన రాజ్యాంగాన్ని నిర్మించి డాక్టర్ బి ఆర్ అంబేత్కర్ అందరి వాడయ్యారన్నారు.

 

ఆ యుగ పురుషుని ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగు జాడల్లో నేటి యువత నడవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

 

అనంతరం పుత్తూరు లోని కార్వేటినగరం కూడలి వద్ద, నారాయణవనం బైపాస్ రోడ్డు వద్దకు చేరుకొని బాబా సాహెబ్ అంబేత్కర్ విగ్రహాలకు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఘన నివాళి అర్పించి, జన్మదిన కేక్ కట్ చేసి, ప్రజలకు స్వీట్లు పంచిపెట్టారు.

 

పుత్తూరు అంబేత్కర్ భవన్ లో జరిగిన సమావేశానికి భారీ సంఖ్యలో జనం తరలిరావడం విశేషం.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!