ePaper
Monday, August 10, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా కూటమి పాలన

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా కూటమి పాలన

📰 Generate e-Paper Clip

* చంద్రబాబు సారథ్యంలో పరుగులు పెడుతున్న అభివృద్ధి,సంక్షేమం.
* ప్రణాళికాబద్ధంగా కుప్పం ప్రగతి.
* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్ పి.ఎస్.మునిరత్నం.
* కుప్పంలో ఇంటింటా టిడిపిలో పాల్గొన్న నేతలు.
కుప్పం,ఆగస్టు 05 (గరుడ ధాత్రి న్యూస్):కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా పరుగులు తీస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్, కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పి.ఎస్. మునిరత్నం స్పష్టం చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జాతీయ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమం కుప్పం పూరపాలక సంఘం పరిధిలో కొనసాగింది. బుధవారం పురపాలక సంఘం పరిధిలోని 21వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్టిసి వైస్ చైర్మన్ మునిరత్నం పాల్గొన్నారు. ఇంటింటా కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా, సమస్యలు ఉన్నాయా అంటూ వాకబు చేస్తూ ముందుకు కదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పరుగులు పెడుతున్నాయన్నారు. ఎన్నో పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి తరలివస్తున్నాయన్నారు. పరిశ్రమల రాకతో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయన్నారు. ఇటీవలే ఉత్తరాంధ్రలో భోగాపురం విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారన్నారు. కుప్పం నియోజకవర్గంలో సైతం విమానాశ్రయం ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారు అన్నారు. ఇప్పటికే దాదాపు పదివేల కోట్ల రూపాయల పెట్టుబడులతో దాదాపు 25 పరిశ్రమలు కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటు అవుతున్నాయన్నారు. ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేసేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. డ్వాక్రా ఉత్పత్తులను ప్రపంచ స్థాయిలో అమ్మకాల కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతులు కల్పనకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. దాదాపు 110 కోట్ల రూపాయలతో కుప్పంలో అన్ని సదుపాయాలతో బస్ స్టేషన్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. కోట్లాది రూపాయల వ్యయంతో కుప్పం నియోజకవర్గంలో దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. టూరిజం అభివృద్ధికి కూడా పక్కా ప్రణాళికతో ముందుకు పోతున్నామన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తున్నారన్నారు.కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కుప్పంలో నిర్వహించిన”రెండు సంవత్సరాల నమ్మకం అభివృద్ధి , సంక్షేమం” కార్యక్రమంలో భాగంగా కుప్పం మున్సిపాలిటీ 10 వక్లస్టర్ 21వ వార్డు 169 బూత్ లో డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గ ఇన్చార్జ్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పి.ఎస్. మునిరత్నం, మున్సిపల్ అధ్యక్షులు వెంకటేష్, మాజీ ఏఎంసీ చైర్మన్ సత్యేంద్రశేఖర్, క్లస్టర్ ఇన్చార్జ్, 20వ వార్డు కౌన్సిలర్ ఎస్. సోమశేఖర్, కౌన్సిలర్ ఎం.ఆర్. సురేష్, యూనిట్ ఇంచార్జి వేణుగోపాల్, బూత్ ఇన్చార్జ్లు జగదీశ్, ప్రసాద్ , సురేష్ , వెంకటప్ప, టిడిపి మహిళా విభాగం నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!