బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబరు 29
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో అక్టోబరు 30న శుక్రవారం ఉదయం 11.30 గంటలకు బైరెడ్డిపల్లి ఎంపీడీఓకార్యాలయంలో
పోటీ చేస్తున్నఅభ్యర్థులు,
రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్లు రిటర్నింగ్ అధికారి ఎన్. వెంకటరాముడు, సహాయ రిటర్నింగ్ అధికారి, ఎంపీడీఓ కె. ఆనందబాబు తెలిపారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ప్రచార వాహనాలు–మైక్ అనుమతులు, ఎన్నికల వ్యయాల నమోదు, ఓటర్లకు నగదు, మద్యం, బహుమతుల వంటి ప్రలోభాల నిషేధంపై సమావేశంలో వివరించనున్నట్లు పేర్కొన్నారు. పోలింగ్ ఏజెంట్ల నియామకం, పోలింగ్ రోజు నిబంధనలు, ఫిర్యాదుల సమర్పణ విధానంపై అవగాహన కల్పించనున్నట్లు
తెలిపారు.
సవరించిన షెడ్యూల్ ప్రకారం నవంబరు 5న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్, అవసరమైతే నవంబరు 6న రీపోలింగ్, నవంబరు 7న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతాయని తెలిపారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని వారు కోరారు.
