ePaper
Saturday, September 26, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఅర్ధగిరి ఆంజనేయుని సేవలో శ్రీలంక క్యాండీ రాజ్య వాసులు.

అర్ధగిరి ఆంజనేయుని సేవలో శ్రీలంక క్యాండీ రాజ్య వాసులు.

📰 Generate e-Paper Clip

కాణిపాకం సెప్టెంబర్ 25(గరుడ దాత్రి న్యూస్) కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బలిజ కులస్థులచే నిర్వహించిన శత కలశ పూజ, శ్రీ స్వామి, అమ్మ వార్ల ఉత్సవ మూర్తులకు పాలాభిషేకంకల్యాణోత్సవం,అశ్వవాహన సేవల్లో విశిష్ట ముఖ్య అతిధులుగా “శ్రీలంక కాండీరాజ్యం పరిపాలించిన బలిజ రాజు కీర్తి శేషులు శ్రీ రాజా విక్రమ రాజ సింఘే వారిఐదవతరం వారసులురాజాపురుషోత్తంరాజా,రాజా నవనీత రాజా, ప్రముఖచరిత్రపరిశోధకులు, బలిజ రాయ తరంగిణి రచయితసుంకర శ్రీరామ్ గిరిధరప్రసాద్ రాయ్, జానకీ దేవి, శ్రీకృష్ణ దేవరాయ మాసపత్రిక గ్రేటర్ రాయలసీమ ప్రతినిధి, సంపాదకీయవర్గ సభ్యుడు, జనసేనపార్టీనిర్మాణసారధుల సమాచార సేకరణ కమిటీ చిత్తూరు పార్లమెంట్ పరిశీలకుల కమిటీ సభ్యుడు నానబాల లోకేష్ రాయల్,సొసైటీఅర్ధగిరివీరాంజనేయ స్వామి ఆలయ బోర్డు సభ్యురాలు బొప్పా రాధిక కుటుంబ సభ్యులతో కలసి పాల్గొన్నారు .అర్ధగిరి వీరాంజనేయ స్వామి వారిని శ్రీలంక క్యాండీ రాజ్యం బలిజ రాజు వారసులుదర్శించుకున్నారు.వీరికి అర్ధగిరి వీరాంజనేయ స్వామి ఆలయ బోర్డు సభ్యురాలు శ్రీమతి బొప్పా రాధిక దర్శన ఏర్పాట్లు చేసి, స్వామి తీర్థప్రసాదాలను అందజేసారు. ఈ కార్యక్రమల్లో వల్లభడైరీ మేనేజర్, అశ్వవాహన ఉభయదారులు కాసల చరణ్ బాబు, కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవాలయ మాజీ బోర్డు సభ్యుడు, అఖిల భారత చిరంజీవి యువత ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, జనసేన పార్టీ నాయకులు పూల ప్రభాకర్, జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి ఆకా పరమ శివయ్య, గిరిబాబు, చెన్నై తమిదలపాటి చెంచులు, జయంతి, పుచ్చకాయల బ్రహ్మయ్య, చిట్టెం కృష్ణగిరి, ఉదయ్, లోక, ప్రసాద్, దుర్గాప్రసాద్, సురేష్, కిరణ్, నవదీప్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!