ePaper
Friday, August 7, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఆడికృత్తికకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

ఆడికృత్తికకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

📰 Generate e-Paper Clip

పలమనేరు,ఆగస్టు 05 ( గరుడ ధాత్రి) : ఆడికృత్తిక మరియు నూతన మసీదు ప్రారంభోత్సవ కార్యక్రమాలకు విచ్చేయాలని శాసన సభ్యులు అమరనాథ రెడ్డిని బుధవారం పలువురు కలసి ఆహ్వానించారు. ఈ నెల 6,7, 8 తేదీలలో పలమనేరు మున్సిపల్ పరిధిలోని టీఎస్ అగ్రహారంలో వెలసి ఉండు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆడికృత్తిక మహోత్సవానికి విచ్చేయాలని ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు ఆయన్ను కలసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదగా పోస్టర్లను ఆవిష్కరించగా కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సత్కరించి ఆహ్వానించారు. అదేవిధంగా వీకోట మండలంలోని నాయక్ అనేది దుర్గం కొండలో జరగనున్న సుబ్రహ్మణ్యస్వామి 48వ ఆడికృత్తికి మహోత్సవానికి విచ్చేయాలని అ మండల వాసులు ఎమ్మెల్యేకు ఆహ్వానం పలికారు. మరోవైపు పెద్దపంజాణి మండలంలోని పంజాని సత్రంలో ఈ నెల 7 న ప్రారంభం కానున్న నూరుల్ హుద జామియా మసీదు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేయాలని మైనారిటీ సోదరులు ఆయనకు ఆహ్వానం తెలిపారు. ఈ కార్యక్రమాలలో నాయకులు రాంబాబు, హరి,నాగరాజు రెడ్డి, రెడ్డెప్ప ,దిలీప్ రెడ్డి, మైనారిటీ నాయకులు ఖాజా, మాభాష, ముబారక్ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!