* గుడిపల్లి మండల టిడిపి అధ్యక్షులు సుబ్రమణి.
కుప్పం,ఆగస్టు 06 (గరుడ ధాత్రి న్యూస్): ప్రకృతి సేధ్యం అత్యంత లాభదాయకమని గుడిపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సుబ్రమణి అన్నారు. గురువారం గుడిపల్లి మండలంలోని చీకటి పల్లి పంచాయతీలో డ్రోన్ సహాయంతో మందులు చల్లే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రకృతి సేద్యం పట్ల రైతులు మక్కువ చూపాలని కోరారు. ప్రకృతి సేద్యంకు ప్రభుత్వం అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తూ ఉందన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ బేటప్ప నాయుడు, మాజీ క్లస్టర్ ఇంచార్జ్ హేమాంబర గౌడు, ప్రధాన కార్యదర్శి సురేష్, అగరం ఎక్స్ సర్పంచ్ గోపాల్, ఎక్స్ ఆత్మ చైర్మన్ చంద్ర, యూనిట్ ఇంచార్జ్ అమరేష్, వ్యవసాయ అధికారులు,ప్రకృతి సేద్యం అధికారులు, రైతులు పాల్గొన్నారు.
ప్రకృతి సేద్యం అత్యంత లాభదాయకం
RELATED ARTICLES
