నాగలాపురంలోని చెల్లి అమ్మన్ ఆలయంలో ఆడినాల చివరి ఆదివారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా మహిళలు ఆలయ ప్రాంగణంలో పొంగళ్లను పెట్టి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయంలో ఉయ్యాల సేవ నిర్వహించారు. ఉయ్యాల సేవను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.
ఆడినెల చెల్లి అమ్మకు ప్రత్యేక పూజలు
RELATED ARTICLES
